ఎట్టకేలకి బొద్దు భామ నమిత పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చింది. శనివారం ఏఐడీఎంకే పార్టీలో చేరి అమ్మ జయలలిత నుంచి తీర్థం పుచ్చుకుంది. దశాబ్ధాలుగా చిత్ర పరిశ్రమలో కొనసాగుతున్న నమితకి ఇదొక కొత్త ఇన్నింగ్స్ అని చెప్పొచ్చు. నమితకి తమిళనాట మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అక్కడ ఒకప్పుడు బొద్దుగుమ్మల హవా బాగా నడిచింది. ఆ సమయంలోనే నమితకి తమిళనాట గుడులు కూడా కట్టారు. నమిత నటించిన సినిమా విడులదవుతోందంటే తమిళనాడులో ఆమె కటౌట్లకి పాలాభిషేకాలు చేసేవారు.
అంతటి క్రేజ్ సంపాదించిన నమిత కొన్నాళ్లపాటు ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసింది. అయితే ఇటీవల కాంపిటీషన్ పెరిగి కాస్త కనుమరుగైంది. కానీ జనాల్లో మాత్రం క్రేజ్ తగ్గలేదు. సో... నమిత ఎంతోకొంత శాతం ఓటర్లని ప్రభావితం చేస్తుందనడంలో సందేహం లేదు. అందుకే జయలలిత కూడా నమితని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించింది. స్వయంగా సభ్యత్వాన్ని అందజేసింది. మరి ఏఐడీఎంకే అధికారంలోకి వస్తే నమిత భవిష్యత్తుల్లో పదవులు చేపట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మరి నమిత సినిమాల్లోలాగే పాలిటిక్స్ లో కూడా విజేతగా నిలుస్తుందో లేదో చూడాలి.