మహేష్ నటించిన సినిమాలన్నీ ఒకెత్తు. శ్రీమంతుడు ఒక్కటీ ఒకెత్తు. బాహుబలి ఇచ్చిన ఊపులో 100 కోట్ల గ్రాస్ క్లబ్ లోకి వెంటనే ఎక్కేసిన సినిమా ఇదే. అసలు ఈ రేంజులో వసూళ్ళు రావాలంటే సినిమాను బాహుబలి రేంజులో తీసుండాలేమో. కాకపోతే మనోడు కేవలం సింపుల్ కంటెంట్ తో ఇదంతా సాధించేశాడు. ఒక చిన్న మెసేజ్ తో ఇంతగా అబ్బురపరిచాడు. మరి ఇదంతా ఎలా సాధ్యమైంది? ఈ వసూళ్ల వెనుక పనిచేసిన మంత్రాంగం ఏమిటి? ఇలాంటి సందేహాలెన్నో అభిమానుల్లో ఉన్నాయి.
అయితే వాటన్నిటికీ ఒకటే సమాధానం. ప్రమోషన్ మంత్రాంగం. పీక్సులో ఉన్న పబ్లిసిటీ. దీనంతటినీ సింగిల్ హ్యాండు తో నడిపించింది స్టార్ వైప్ నమ్రతా శిరోద్కర్. ఆమె వేసిన పబ్లిసిటీ స్కెచ్ ఒక లెవెల్లో వర్కవుట్ అవ్వడంతో ప్రేక్షకులు సినిమాకు ఓ రేంజులో కనక్టు అయ్యారు. కెరీర్ లోనే ఎన్నడూ లేని విధంగా ఈసారి మహేష్ పబ్లిసిటీ హడావుడి చేశాడు. పెద్ద చానెల్, చిన్న చానెల్ అనే తేడా లేకుండా ప్రతి టీవీ చానెల్ కి వెళ్లొచ్చాడు. చిట్ చాట్ లు, ఇంటర్వ్యూ లు ఇచ్చాడు. పత్రికలు, మ్యాగజైన్ లు, వెబ్ ప్రపంచాన్ని పిలిచి మరీ ఇంటర్వ్యూ లు ఇచ్చారు. అలాగే ఫేస్ బుక్ సహా ఆన్ లైన్ లో కావాల్సినంత సమాచారాన్ని సందర్భానుసారం ప్రమోట్ చేశారు. నటీనటులు, సాంకేతిక నిపుణులు ఒక్కొక్కరుగా మీడియా ముందుకు ఎలా వెళ్లాలి అన్నది ముందే డిజైన్డ్. ఈ డిజైన్ చేసిందంతా నమ్రతనే.
నిజానికి బాలీవుడ్ నుంచి ప్రముఖ మార్కెటింగ్ స్పెషలిస్టుల్ని కలిసి సలహాలు తీసుకుని మరీ ఇలా చేసిందట. ఎంతైనా మొదటిసారి ప్రొడక్షన్ లోకి వచ్చారు మమేష్, నమ్రత. అందుకే ఇదంతా ముందుండి నడిపించారు. వారి స్ట్రాటజీలు అన్నీ ఫాలో అయిన సూపర్ స్టార్ ఇలా పంపిణీదారులను ప్రాఫిట్ల బాటలో నడిపించేస్తున్నాడు. ఇక మీదట వచ్చే తన సినిమాలన్నింటికీ నమ్రత అండ్ టీమ్ పనిచేస్తారట మరి. ఇక వసూళ్ళ రచ్చే బాబోయ్!!