ఆవిడ చాలా స్ట్రిక్టు- మ‌హేష్‌

Update: 2019-06-20 06:07 GMT
ఆవిడేమో స్ట్రిక్టు.. నేనేమో గారాబం! ... ఈ మాట‌న్న‌ది ఎవ‌రో తెలుసా?  సూపర్ స్టార్ మ‌హేష్‌. పిల్ల‌ల అతిగారాబం విష‌యంలో న‌మ్ర‌త చాలా జాగ్ర‌త్త‌గా ఉంటుంద‌ని.. తాను ఎప్పుడైనా గౌత‌మ్ - సితార‌ల విష‌యంలో అతి గారాబం చేస్తే వెంట‌నే తాను మాత్రం మొట్టికాయ వేస్తుంద‌ని అన్నారు మ‌హేష్‌. న‌మ్ర‌త ఆమాత్రం జాగ్ర‌త్త‌గా ఉంటుంది కాబ‌ట్టే పిల్ల‌లు అదుపులో ఉంటార‌ని తెలిపారు. ఇటీవ‌లే యూర‌ప్ ట్రిప్ ముగించుకుని ఇండియాకి తిరిగి వ‌చ్చిన మ‌హేష్ ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ పైవిధంగా స్పందించారు.

మ‌హేష్ మాట్లాడుతూ.. నా ఫ్యామిలీ నా బిగ్గెస్ట్ స్ట్రెస్ బ‌స్ట‌ర్. న‌మ్ర‌త సాయం చాలా విషయాల్లో ఉంటుంది. అది కేవ‌లం రిలీజ్ డే టెన్ష‌న్స్ నుంచి బ‌య‌ట‌ప‌డేసేందుకే కాదు. నేను ఎప్పుడు ఆందోళ‌న‌లో ఉన్నా తిరిగి ప్ర‌శాంత స్థితికి వ‌చ్చేందుకు నా భార్య‌.. పిల్ల‌లు నాకు ఎంతో సాయమ‌వుతారు`` అని అన్నారు.

మ‌హేష్ న‌టించిన భ‌ర‌త్ అనే నేను.. మ‌హ‌ర్షి రిలీజ్ లు స‌హా ప్ర‌మోష‌న్స్ విష‌యంలో న‌మ్ర‌త హార్డ్ వ‌ర్క్ ఎంతో తెలిసిందే. మ‌హేష్ సినిమాల రిలీజ్ ల వేళ ఆ టెన్ష‌న్ మొత్తం త‌నే తీసుకుంటుంది. అలా మ‌హేష్ రిలాక్స్ డ్ గా ఉండ‌గ‌ల‌రు. ఇక పిల్ల‌ల టెన్ష‌న్ కూడా త‌న‌కు ఇవ్వ‌రు న‌మ్ర‌త‌. అదే విష‌యాన్ని మ‌రోసారి జాతీయ మీడియాకు అర్థ‌మ‌య్యేలా చెప్పారు సూప‌ర్ స్టార్. మ‌హేష్ ప్ర‌స్తుతం కెరీర్ 26వ సినిమా స‌రిలేరు నీకెవ్వ‌రూ చిత్రీక‌ర‌ణ‌లో పాల్గొనేందుకు రెడీ అవుతున్న‌ సంగ‌తి తెలిసిందే. త్వ‌ర‌లోనే సెట్స్ పైకి వెళ్ల‌నున్నారు. అనీల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో అనీల్ సుంక‌ర‌- దిల్ రాజు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


Tags:    

Similar News