మ‌రాఠా ఫ్యాన్స్ కి ప్రేమ‌తో.. సీతా పాప‌!

Update: 2020-03-26 05:00 GMT
మ‌హేశ్-న‌మ్ర‌త‌ల గారాల ప‌ట్టి సితార (సీతా పాప‌) సోష‌ల్ మీడియాల్లో ఎంత యాక్టివ్ గా ఉంటుందో చెప్పాల్సిన ప‌నిలేదు. త‌న‌దైన చలాకీత‌నం చూపించి వీక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటోంది ఈ క్యూటీ.  సొంతంగా ఓ యూ ట్యూబ్ ఛానెల్ ని లాంచ్ చేసిన సితార‌ త‌న‌కు సంబంధించిన చాలా విష‌యాల‌ను షేర్ చేస్తుంటుంది. అప్పుడ‌ప్ప‌డు గ్రేట్ డాడీ మ‌హేష్‌ సినిమాల‌కు ప్ర‌చారం చేస్తుంటుంది. ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ ట్రెండ్ న‌డుస్తోన్న నేప‌థ్యంలో స్కూల్స్ సెల‌వులు ప్ర‌క‌టించ‌డంతో సితార ఎక్కువ స‌మయాన్ని ఇంట్లోనే గ‌డుపుతోంది. ఇటీవ‌లే తండ్రి మ‌హేష్ తో ఎక్కువ సేపు ఆడుకుంటున్నాన‌న‌ని తెలిపింది. ఆ విశేషాల‌ను అన్నింటినీ సితార అభిమానుల‌కు షేర్ చేసింది.

తాజాగా బుధ‌వారం ఉగాదిని పుర‌స్క‌రించుకుని మ‌రాఠా పండుగ `గుడి ప‌ద్వా` సంద‌ర్భంగా మ‌రాఠా  సంప్ర‌దాయంలో  ప్రేక్ష‌కులంద‌రికీ శుభాకాంక్ష‌లు తెలిపింది. దానికి సంబంధించిన ఓ వీడియోను సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. హైద‌రాబాద్ లో ఉన్న‌ తెలుగింటి చిన్నారి పాపాయి ఇలా మ‌రాఠా అభిమానుల‌కు విషెస్ చెప్ప‌డం ఏమిటో అనుకుంటున్నారా? అయితే అస‌లు వివ‌రాల్లోకి వెళ్లాల్సిందే. మ‌హేష్ స‌తీమ‌ణి న‌మ్ర‌త మ‌రాఠి. న‌మ్ర‌త పుట్టి పెరిగింది మ‌హ‌రాష్ట్ర‌లోనే. మోడ‌ల్ గా కెరీర్ ప్రారంభించి సినిమా స్టార్ గా ఎదిగారు. అటుపై మ‌హేశ్ ని  ప్రేమించి పెళ్లాడిన సంగ‌తి తెలిసిందే. అలా న‌మ్ర‌త తెలుగింటి కోడ‌లయ్యారు.

అయినా మ‌రాఠా సంస్కృతిని మాత్రం న‌మ్ర‌త మ‌రువ‌లేదు.  అక్క‌డ జ‌రిపే ప్ర‌తీ పండుగ‌ను హైద‌రాబాద్ లో త‌న ఇంట్లోని  జ‌రుపుకోవ‌డం అన‌వాయితీ.  ఈ సంద‌ర్భంగా సితార  మారాఠా అభిమానులంద‌రికీ శుభాకాంక్ష‌లు తెలిపింది. ఇక మ‌రాఠా భాష‌ను సితార అన‌ర్ఘ‌ళంగా మాట్లాడుతుంటుంది.  ఇంట్లో త‌ల్లితో మ‌రాఠి భాష‌లో మాట్లాడుతుంది. తండ్రితో వ‌చ్చిరాని తెలుగు మాట్లాడుతుంటుంది. నమ్ర‌త‌ కుటుంబంలో ఎక్కువ‌గా ఇంగ్లీష్ లో మాట్లాడుకుంటార‌ని ఓ ఇంట‌ర్వూలో మ‌హేష్ తెలిపారు.

వీడియో కోసం క్లిక్ చేయండి
Tags:    

Similar News