మహేష్‌బాబు - శేఖర్ కమ్ముల కాంబినేషన్లో సినిమా గురించి గత రెండు రోజులుగా ఫిల్మ్‌నగర్‌లో చర్చ సాగుతోంది. త్రివిక్రమ్, పూరి జగన్నాథ్‌లాంటి స్టార్ డైర్టెర్లు క్యూలో ఉండగా మహేష్ ఇక శేఖర్ కమ్ములతో సినిమా ఎప్పుడు చేసేదంటూ కొంతమంది లైట్‌గా మాట్లాడుకొంటున్నారు. కానీ మహేష్ నిజంగానే శేఖర్ కమ్ములకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. ఆ చిత్రాన్ని నిర్మించేది కూడా మహేష్ భార్య నమ్రతనేనట. నమ్రతతో పాటు ఓ ప్రముఖ దర్శకుడు కూడా నిర్మాణంలో పాలు పంచుకొంటాడని సమాచారం. త్వరలోనే ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలున్నాయి.
మహేష్‌బాబు ప్రస్తుతం 'బ్రహ్మూెత్సవం'లో నటిస్తున్నాడు. అది పూర్తవ్వగానే శేఖర్ కమ్ముల సినిమానే చేయాలని నిర్ణయించుకొన్నాడట. ఆ మేరకు డేట్లు కూడా సర్దుబాటు చేశాడని తెలిసింది. మహేష్‌తో సినిమా చేయాలని ఎప్పట్నుంచో ప్రయత్నాలు చేస్తున్నాడు శేఖర్ కమ్ముల. తక్కువ బడ్జెట్‌తోనే పూర్తి కానున్న ఆ చిత్రాన్ని తానే సొంతంగా నిర్మిస్తే ఎలా ఉంటుందని మహేష్ భార్య నమ్రత అడిగిందట. అందుకు మహేష్ కూడా ఒప్పుకొన్నారని సమాచారం. ఇటీవలే మహేష్‌బాబు తన పేరుతో ఓ బ్యానర్‌ని స్థాపించాడు. ఆ బ్యానర్‌పైనే నమ్రత నిర్మాణంలో సినిమా తెరకెక్కనున్నట్టు తెలిసింది. ఒక సోషల్ ఎలిమెంట్‌ని బేస్ చేసుకొని సినిమాని తీస్తాడట కమ్ముల.