నందమూరి హరికృష్ణ నల్లగొండ జిల్లా కేంద్రం సమీపంలో అన్నెపర్తి వద్ద కారు ప్రమాదంలో మరణించిన విషయం తెల్సిందే. నేడు తెల్లవారు జామున అభిమాని పెళ్లికి వెళ్తున్న హరికృష్ణ కారు అదుపు తప్పి ప్రమాదంకు గురైంది. గతంలో కూడా నందమూరి ఫ్యామిలీకి చెందిన ఎన్టీఆర్ మరియు జానకిరామ్‌లకు నల్లగొండ జిల్లాలో యాక్సిడెంట్స్ జరిగాయి. 2009 ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖమ్మం వెళ్లి వస్తున్న జూనియర్ ఎన్టీఆర్ కారు నల్లగొండ జిల్లా మోతె వద్ద ప్రమాదంకు గురైంది. ఆ ప్రమాదంలో ఎన్టీఆర్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. ఆ ప్రమాదం నుండి ఎన్టీఆర్ రెండు నెలల తర్వాత తేరుకున్నాడు.
ఎన్టీఆర్ ప్రమాదం గురించి అప్పుడప్పుడే మర్చి పోతున్న నందమూరి ఫ్యామిలీకి జానకిరామ్ యాక్సిడెంట్ కన్నీరును మిగిల్చింది. 2014 సంవత్సరంలో హరికృష్ణ పెద్ద కొడుకు అయిన జానకిరామ్ ప్రయాణిస్తున్న కారు నల్లగొండ జిల్లా మునగాల మండ కేంద్రం వద్ద యాక్సిడెంట్‌కు గురైంది. ఆ ప్రమాదంలో జానకిరామ్ మృతి చెందాడు. తాజాగా హరికృష్ణ కూడా నల్లగొండ జిల్లా కేంద్రంలోనే మృతి చెందడంతో నందమూరి ఫ్యామిలీకి నల్లగొండ జిల్లా అంటేనే కాస్త భయంగా ఉండి ఉంటుంది.
హరికృష్ణ కొన్నాళ్ల క్రితం అనారోగ్యం బారిన పడ్డారు. అయితే ఈమద్య కాలంలో ఆయన పూర్తి ఆరోగ్యంతో మునుపటిలా ఉత్సాహంగా కనిపిస్తున్నారు. మళ్లీ హరికృష్ణ సినిమాల్లోకి వస్తారు అనుకుంటున్న సమయంలో ఇలా జరగడం సినిమా పరిశ్రమకు షాకింగ్‌గా ఉంది. హరికృష్ణ మృతితో నందమూరి ఫ్యామిలీతో పాటు టీడీపీ వర్గాల వారు కన్నీరు మున్నీరు అవుతున్నారు.