నందమూరి క్యాంప్ ఏం చేయబోతోంది?

Update: 2019-03-09 09:30 GMT
లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదలకు ఈ రోజుని మినహాయిస్తే కేవలం 12 రోజుల వ్యవధి మాత్రమే ఉంది. నందమూరి నారా మద్దతుదారులు ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ విడుదల కాకూడదని కోరుకుంటుండగా నా ప్రాణం పోయినా ఇది యూట్యూబ్ లో పెట్టమని వీలునామా రాశానని వర్మ చెప్పడం ఇప్పటికే సంచలనం రేపింది. ఈ నేపథ్యంలో ఇంత కాలం మౌనం వహించిన నందమూరి ఫామిలీ రెండో ట్రైలర్ చూసాక అంతర్గతంగా తీవ్రంగా స్పందించినట్టు సమాచారం.

ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ హై కోర్టుల్లో ఒకేసారి పిటీషన్ వేసి దీని రిలీజ్ ఆపేందుకు న్యాయ నిపుణుల సలహాలు సూచనలతో సర్వం సిద్ధం చేసినట్టు సమాచారం. ఇది అధికారికంగా ధృవీకరించే అవకాశం లేదు కాబట్టి విశ్వసనీయ సమాచారం మేరకు ఈ పాటికే ఏర్పాట్లు పూర్తయ్యాయట. ఇదంతా బాలకృష చూసుకుంటున్నారో లేక కేంద్ర పార్టీలో కీలక పాత్ర వహిస్తున్న పురంధరేశ్వరి డీల్ చేస్తున్నారో ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది

ఇంకో వారం లోపే వర్మ సెన్సార్ పూర్తి చేయించుకుంటాడు. సెన్సార్ నుంచి అభ్యంతరం రాకుండా వాళ్ళు ఏమి అబ్జెక్షన్ చేస్తారో ముందే గుర్తించి దానికి తగ్గ సమాధానాలు రెడీగా ఉంచుకున్నట్టు తెలిసింది. ఒకవేళ కోర్ట్ ద్వారా ఏదైనా అడ్డంకి వస్తే ఎలా ఫేస్ చేయాలో ఇప్పటికే తన లీగల్ టీమ్ తో చర్చించి సిద్ధంగా ఉన్నాడట. అయితే చంద్రబాబు సూచనల మేరకే నందమూరి క్యాంప్ ఇంత కాలంగా వ్యూహాత్మక మౌనం వహించినట్టు మరో న్యూస్ ఉంది.

ఏదైతేనేం ఇప్పుడు వ్యవహారం కోర్టుకు వెళ్తే ఇది కాస్తా వర్మ VS నందమూరి క్లాష్ గా మారుతుంది. మరోవైపు టిడిపి మద్దతుదారులు కూడా తమ ముఖ్యమంత్రి ఇమేజ్ ని దెబ్బ తీసే ప్రయత్నంగా ఉటంకిస్తూ పిల్స్ వేసే ప్రయత్నాల్లో ఉన్నట్టు మరో టాక్. మొత్తానికి సెన్సార్ కు ముందే లక్ష్మిస్ ఎన్టీఆర్ వేడి రాజేసింది
Tags:    

Similar News