కళ్యాణ్ రామ్ దూకుడుకి సాటెవ్వరు..!

Update: 2022-11-07 06:30 GMT
నందమూరి హీరోల్లో హీరోగా నిర్మాతగా ప్రయోగాలు చేస్తూ వస్తున్న కళ్యాణ్ రామ్ తను చేస్తున్న ప్రయత్నాల్లో పది ఫెయిల్ అయి ఒకటి సక్సెస్ అయినా ఆ హిట్ జోష్ తో మరో 10 సినిమాలు చేస్తాడు. అంతేకాదుకొత్తవారికి అవకాశం ఇవ్వడంలో ముందుంటాడు కళ్యాణ్ రామ్. రీసెంట్ గా బింబిసార అంటూ ఓ మూవీని చేసి సూపర్ హిట్ అందుకున్నాడు. వశిష్ట డైరక్షన్ లో తెరకెక్కిన బింబిసార నటుడిగానే కాదు నిర్మాతగా కూడా కళ్యాణ్ రామ్ కి మంచి లాభాలు తెచ్చిపెట్టింది. ఆ మూవీకి వచ్చిన క్రేజ్ చూసి బింబిసార 2 ని కూడా ప్లాన్ చేయాలని చూస్తున్నారు.

ప్రస్తుతం కళ్యాణ్ రామ్ మరో రెండు మూవీస్ చేస్తున్నాడు. డెవిల్ అంటూ ఒక పీరియాడికల్ మూవీ లో నటిస్తున్న ఈ నందమూరి హీరో ఎమిగోస్ అంటూ మరో క్రేజీ మూవీతో వస్తున్నాడు. రాజేంద్ర రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో కళ్యాణ్ రామ్ స్టైలిష్ లుక్ తో కనిపిస్తారని తెలుస్తుంది.

ఇక సినిమా రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేస్తూ లేటెస్ట్ గా ఒక పోస్టర్ రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఈ పోస్టర్ కూడా సంథింగ్ స్పెషల్ గా అనిపిస్తుంది. పోస్టర్ రిలీజ్ చేస్తూ ఎక్స్ పెక్ట్ ద అన్ ఎక్స్ పెక్టెడ్.. హు లుక్స్ జస్ట్ లైక్ యు అంటూ కామెంట్ పెట్టారు. చూస్తుంటే కళ్యాణ్ రామ్ ఈసారి కూడా మరో కొత్త ప్రయత్నంతో వస్తున్నారని చెప్పొచ్చు.

నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చి రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు చేస్తే కెరియర్ సక్సెస్ ఫుల్ గా సాగించవచ్చు. కానీ ఆడియన్స్ కి ఒక ప్రత్యేకమైన సినిమా అనుభూతిని ఇవ్వాలని.. కొత్త కథలను వారి దగ్గరకు తీసుకు రావాలని కళ్యాణ్ రామ్ కొత్త వారికి అవకాశం ఇస్తూ వస్తున్నారు. ఆయన అలా చేసిన ప్రతిసారి సక్సెస్ కొడుతూనే ఉన్నారు. ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ డైరక్టర్స్ గా ఉన్న అనీల్ రావిపుడి, సురేందర్ రెడ్డి కళ్యాణ్ రామ్ అవకాశం ఇవ్వబట్టే తొలి సినిమా చేయగలిగారు.

ఇక ఇప్పుడు ఎమిగోస్ తో మరో దర్శకుడిని పరిచయం చేస్తున్నారు. ఎమిగోస్ కథ.. స్క్రీన్ ప్లే తప్పకుండా తెలుగు ఆడియన్స్ ని అలరిస్తాయని అంటున్నారు. కళ్యాణ్ రామ్ మాత్రం ఈ సినిమాపై సూపర్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు.

సినిమా ప్రీ లుక్ పోస్టర్ మాత్రమే రిలీజ్ చేయగా అసలు సినిమా జోనర్ ఏంటి.. మిగతా కాస్టింగ్ ఎవరన్నది త్వరలో తెలుస్తుంది. కళ్యాణ్ రామ్ ఎమిగోస్ సినిమాని ఫిబ్రవరి 10న రిలీజ్ ఫిక్స్ చేశారు. సినిమా రిలీజ్ కు మూడు నెలల ముందే రిలీజ్ లాక్ చేసి అలర్ట్ అందించారు. పోస్టర్ తోనే అంచనాలు పెంచిన కళ్యాణ్ రామ్ ఎమిగోస్ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News