ఈ ఏడాది 118తో ఓ డీసెంట్ మూవీని తన ఖాతాలో వేసుకున్న నందమూరి కళ్యాణ్ రామ్ మరో కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. శతమానం భవతి లాంటి జాతీయ అవార్డు గెలుచుకున్న ఫ్యామిలీ దర్శకుడు సతీష్ వేగ్నేశతో తన 17వ సినిమా చేయబోతున్నాడు. దీనికి శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణప్రసాద్ సమర్పకులుగా సుప్రసిద్ధ ఆడియో సంస్థ ఆదిత్య మ్యూజిక్ వ్యవస్థాపకులు ఉమేష్ గుప్తా నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఇందులో హీరొయిన్ గా మెహ్రీన్ ను ఫిక్స్ చేశారు. గోపి సుందర్ సంగీతం అందించనున్నారు.
ఇది కూడా పూర్తిగా కుటుంబ కథా చిత్రం తరహాలో ఎమోషన్స్ కు పెద్ద పీట వేస్తూ కళ్యాణ్ రామ్ మాస్ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని రాసుకున్నట్టుగా తెలిసింది. ఇప్పటిదాకా ఒక జానర్ కు కట్టుబడ్డ కళ్యాణ్ రామ్ గత ఏడాది నుంచి ప్రయోగాల బాట పట్టాడు. సతీష్ వేగ్నేషకే పోయిన సంవత్సరం నితిన్ శ్రీనివాస కళ్యాణం పెద్ద దెబ్బే వేసింది. ఆశించిన దాని కన్నా తీసికట్టు ఫలితం అందుకోవడంతో దిల్ రాజు ఈయనతోనే తీయాలని ప్లాన్ చేసుకున్న థాంక్ యు అనే ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడీ కథ కొత్తగా లేక అదేనా అనే క్లారిటీ అయితే లేదు.
సతీష్ వేగ్నేశ సినిమాలలో మాస్ మాసాలాలు లేకపోయినా ఫ్యామిలీ మొత్తాన్ని ఎంగేజ్ చేసే ఎలిమెంట్స్ కు లోటు లేకుండా చూసుకుంటారు. ఇప్పుడీ కళ్యాణ్ రామ్ సినిమా కూడా అదే తరహలో ఉండబోతున్నట్టు తెలిసింది. ఇప్పటిదాకా యాక్షన్ రోల్స్ లో కనిపించిన కళ్యాణ్ రామ్ ఇలాంటి సాఫ్ట్ సబ్జెక్టు లో ఎలా కనిపిస్తాడో వేచి చూడాలి. మిగిలిన టీం తారాగణం వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు