118 లాంటి ప్రయోగంతో క్రిటిక్స్ ప్రశంసలు అందుకున్న కళ్యాణ్ రామ్ ఆ తర్వాత ఇప్పటివరకూ కొత్త సినిమాని ప్రకటించలేదు. మల్లిడి వేణు దర్శకత్వంలో తుగ్లక్ అనే సినిమాలో నటిస్తున్నానని ఇదివరకూ వెల్లడించారు. అయితే కథపై పూర్తి క్లారిటీ రావాల్సి ఉందని అన్నారు. తాజా సమాచారం ప్రకారం.. కళ్యాణ్ రామ్ `తుగ్లక్` పై పూర్తి క్లారిటీ వచ్చేసిందిట. ప్రీప్రొడక్షన్ పనులు వేగంగానే సాగుతున్నాయని.. మరో వారంలోనే సినిమాని పట్టాలెక్కించేందుకు సమాయత్తమవుతున్నారని తెలుస్తోంది. ఆ మేరకు క్లోజ్ సోర్సెస్ నుంచి సమాచారం అందింది. ఈ సినిమాని ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై కళ్యాణ్ రామ్ స్వయంగా నిర్మిస్తున్నారు.
వైవిధ్యం ఉన్న కథల ఎంపికలో వెనకాడని కళ్యాణ్ రామ్ కి `పటాస్` తర్వాత మళ్లీ అంత పెద్ద హిట్ లేదు. 118 చిత్రం కంటెంట్ పరంగా బావుందని పేరొచ్చినా.. బాక్సాఫీస్ వద్ద కేవలం అబౌ యావరేజ్ మాత్రమే. అందుకే కళ్యాణ్ రామ్ - మల్లిడి వేణు కాంబో మూవీ కెరీర్ కి ఎంతో కీలకం కాబోతోంది. ఈ సినిమా కథాంశం సోషియో ఫాంటసీ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని తెలుస్తోంది. తుగ్లక్ అనే టైటిల్ ఎంపికతోనే ప్రయోగానికి శ్రీకారం చుట్టారని భావించవచ్చు. ఈ చిత్రంలో కథానాయికగా ఎవరు నటిస్తున్నారు? ఇతరత్రా కాస్టింగ్ వివరాల్ని ప్రారంభోత్సవంలోనే చెబుతారట.
ప్రస్తుత సీజన్ లో కథ- కంటెంటే కింగ్ అని హీరోలంతా బహిరంగంగా ప్రకటిస్తున్నారు. అదే బాటలో క్రియేటివ్ కంటెంట్ తోనే ఈ జోడీ సెట్స్ పైకి వెళుతున్నారని అర్థమవుతోంది. రొటీన్ మాస్ ఎంటర్‌టైనర్ లకు కాలం చెల్లింది. లాజిక్ లేని మూస కథలతో సినిమాలు తీస్తే ఆశించిన విజయం దక్కడం లేదు. అందుకే కళ్యాణ్ రామ్ స్టోరీ సెలక్షన్ కాస్తంత అవేగానే ఉందని అర్థమవుతోంది.