నందమూరి MLA కొత్త సినిమా!!

Update: 2017-05-06 11:44 GMT
నందమూరి కుటుంబం నుండి వచ్చి అందరూ వెళ్ళే దారిలో వెళ్తూనే తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న నటుడు నిర్మాత కల్యాణ్ రామ్. పటాస్ తర్వాత మంచి సత్తా ఉన్న స్క్రిప్ట్ కోసం చూస్తున్న కల్యాణ్ రామ్ ఇప్పుడు ఒక కొత్త డైరెక్టర్ చెప్పిన కథకు సై అని చెప్పారు. ఈ సినిమా మే 10న ప్రారంభంకాబోతుంది.

ఈ సినిమాకి టైటిల్ MLA అని పెట్టారు అంటే రాజకీయ కథ అనుకునేరు​...​ కాదండోయ్.. “మంచి లక్షణాలున్న అబ్బాయి “. ఇది పూర్తి ఫ్యామిలి కథ అని చెపుతున్నారు డైరెక్టర్ ఉపేంద్ర మాధవ్. కల్యాణ్ రామ్ ఇంతకుముందు కూడా చాలవారుకు కొత్త డైరెక్టర్లతో సినిమాలు చేశాడు. కాకపోతే ఈ సినిమా ఫ్యామిలీ సెంటిమెంట్ అండ్ కామెడీ సమపాళ్ళలో ఉండటం​తో ఒకే చెప్పినట్లు తెలుస్తుంది. ఈ సినిమా డైరెక్టర్ ఉపేంద్ర ఇంతకు ముందు శ్రీను వైట్ల.. అనిల్ రావిపూడి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశారు.

సినిమా గురించి కల్యాణ్ రామ్ మాట్లాడుతూ  “పటాస్ తరవాత చాలా కథలు విన్నాను. ఉపేంద్ర నాకు ముందే తెలుసు. పటాస్ కు కూడా అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాడు. అతను చెప్పిన కథ నాకు బాగా నచ్చి చేయడానికి ఒప్పుకున్నాను. నాకు కథ పై చాలా నమ్మకం ఉంది. ఇది మంచి వినోదబభరిత చిత్రం అవుతుంది'' అని చెప్పాడు. చూద్దాం ఈ సినిమా అతని స్టార్ స్టేటస్ని ఎంత వరుకు పెంచుతుందో.  ​

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News