నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ ఎప్పుడు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తాడని అందరూ ఎదురు చూస్తున్నారు. బాలకృష్ణ ఇటీవలే అరవైవ పడిలో అడుగు పెట్టి షష్టి పూర్తి చేసుకోనున్నట్లు తెలుస్తుంది. అయినా బాలకృష్ణ ఇప్పటికి స్టార్ హీరోగానే ఇండస్ట్రీలో తన హవా కొనసాగిస్తున్నాడు. వరుస పరాజయాలు ఎదురైనా ఆయన ఏ మాత్రం తగ్గకుండా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. తాజాగా ఆయన 106వ సినిమా టీజర్ వదిలి మళ్లీ తను ఫామ్ లోనే ఉన్నానంటూ గుర్తుచేసాడు. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పై నందమూరి అభిమానులలో అంచనాలు జోరు మీద ఉన్నాయి. ఆ అంచనాలు అందుకునేలా టీజర్ లుక్ లో చూపించాడు బోయపాటి.
అయితే బాలకృష్ణ సంగతి పక్కన పెడితే.. ప్రస్తుతం బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఆయన కొడుకు మోక్షజ్ఞ పేరు బయటికి వస్తుంది. మోక్షజ్ఞ సినీ హీరోగా ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడని అందరి మదిలో మెదులుతున్న ప్రశ్నలు. మోక్షజ్ఞ హీరోగా వస్తాడని అనుకున్న ప్రతిసారి నిరాశకు గురి చేస్తున్నాడు బాలకృష్ణ. మోక్షజ్ఞ హీరో ఎంట్రీ పై ఆయన నోరు మెదపడం లేదు. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కూడా బాలకృష్ణ మేటర్ స్కిప్ చేసేసాడు. అయితే మోక్షజ్ఞ మాత్రం హీరో అవ్వడేమో అంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మోక్షజ్ఞ ఫిజిక్ చూస్తుంటే ఆయనకు సినిమాల్లో నటించడం ఏమాత్రం ఆసక్తి లేనట్లు అన్పిస్తుంది. ఎందుకంటే ఆయన లావు అస్సలు తగ్గడం లేదు.
గత రెండు మూడు సంవత్సరాలుగా మోక్షజ్ఞను చూస్తున్న వారు ఎవరైనా కూడా అతడు బరువు తగ్గడెమో అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మోక్షజ్ఞ బరువు తగ్గేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు అంటున్నారు. కాని మోక్షజ్ఞ మాత్రం బరువు తగ్గినట్లుగా కనిపించడం లేదు. మోక్షజ్ఞ ఈరోజు తండ్రి పుట్టినరోజు సెలెబ్రేషన్స్ లో కనిపించాడు. ఈసారి కూడా మళ్లీ మోక్షజ్ఞ బరువు చూసి అంతా అవాక్కవుతున్నారు. మోక్షజ్ఞ మొహంలో హీరోకి ఉండాల్సిన గ్లో లేకపోవడంతో పాటు లావు ఎక్కువగా ఉండటంతో మోక్షజ్ఞ హీరో అవుతాడా లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరి చూడాలి బాలయ్య మదిలో ఏముందో..!