థ్రిల్లర్ సెవెన్ లో కిల్లర్ బ్యూటీ!

Update: 2018-10-12 11:59 GMT
ఎక్కడికి పోతావు చిన్నవాడలో హీరో నిఖిల్ ని భయపెడుతూనే తన పెర్ఫార్మన్స్ తో కట్టిపడేసిన నందిని శ్వేతా కీలక పాత్రలో నటిస్తున్న 7లో తన లుక్ తాలూకు పోస్టర్ విడుదల చేసారు. రమేష్ వర్మ రచన ప్లస్ నిర్మాణం బాధ్యతలు వహిస్తుండగా నిజార్ షఫీ ఛాయాగ్రహణంతో పాటు దర్శకత్వ బాధ్యతలు మోస్తూ రూపొందుతున్న ఈ థ్రిల్లర్ మూవీ మీద మంచి అంచనాలే ఉన్నాయి. ప్రేక్షకులకు ఇప్పుడిప్పుడే దీని గురించి తెలుస్తున్నా ముందుకు వెళ్లే కొద్ది ప్రమోషన్ ద్వారా ఇది ఎలాంటి న్యూ ఏజ్ థ్రిల్లరో చెబుతామంటున్నారు దర్శక నిర్మాతలు.

నందిని శ్వేతా ఇటీవల నితిన్ శ్రీనివాస కళ్యాణంలో మరదలిగా చెప్పుకోదగ్గ పాత్రే చేసింది కానీ దాని ఫలితం నిరాశ కలిగించింది. అందుకే 7 తనకో పెద్ద బ్రేక్ అవుతుందన్న నమ్మకంతో ఉంది. 7 త్వరలోనే విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్న 7 టైటిల్ లోని మర్మం మాత్రం సస్పెన్స్ అంటున్నారు. ఏడుగురి చుట్టూ తిరిగే కథేనా లేక ఏడు గంటలకు సంబంధించిన చిక్కు ముడి ఏదైనా ఉంటుందా అనే క్లూ కూడా ఇవ్వడం లేదు.

ఇందులో నందిని శ్వేతా పాత్ర పేరు రమ్యగా పరిచయం చేసారు. ఒక్కొక్క పాత్రకు సంబంధించిన పేరు తో పాటు లుక్స్ ని ఒక్కొక్కటిగా రిలీజ్ చేయబోతున్నారు. మెప్పించే కంటెంట్ ఉంటే చాలు థ్రిల్లర్స్ కు మంచి ఆదరణ ఉన్న ట్రెండ్ లో 7 కూడా విజయం సాధిస్తుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది.
Tags:    

Similar News