ఆ రీమేక్ లో నాని సామ్?

Update: 2018-09-29 06:07 GMT
సమంతా ఇప్పుడంటే పెళ్లయ్యాక కొత్త కొత్త రోల్స్ లో విభిన్నంగా కనిపిస్తోంది కానీ కెరీర్ ప్రారంభంలో చేసిన చాలా రోల్స్ తనకు యూత్ లో క్యూట్ బ్యూటీగా పెద్ద ఫాలోయింగ్ ని తెచ్చాయి. అందులో ఒకటి ఎటో వెళ్లిపోయింది మనసు. నాని హీరోగా సమంతా హీరోయిన్ గా రూపొందిన ఆ మూవీ మంచి క్లాసిక్ గా మిగిలిపోయింది. ఆ తర్వాత ఎవరి కెరీర్ లో వారు బిజీగా మారడంతో కలిసి నటించే అవకాశం దక్కలేదు. దిల్ రాజు ఈ కాంబినేషన్ ని సెట్ చేసే పనిలో ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం.

తమిళ్ లో విజయ్ సేతుపతి త్రిష జంటగా 96 అనే సినిమా రూపొందింది. అక్టోబర్ 4న దీన్ని విడుదల చేయబోతున్నారు. మొరటుగా అనిపించే విజయ్ స్వీట్ బ్యూటీ త్రిష కాంబో మీద ఇప్పటికే తమిళ్ లో మంచి అంచనాలు ఉన్నాయి. ట్రైలర్ కూడా భారీ స్పందన తెచ్చుకుంది. అందుకే గట్టి నమ్మకంతో దిల్ రాజు దీని రీమేక్ హక్కులు తీసుకున్నట్టు తెలిసింది. ఈ 96నే  నాని సమంతాలతో తెలుగులో చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట దిల్ రాజు. కథ చెప్పారా గ్రీన్ సిగ్నల్ వచ్చిందా లేదా అనే కన్ఫర్మేషన్ లేదు కానీ చర్చల దశలో ఉన్నట్టు సమాచారం. ఎలాగూ ఒక వారం తర్వాత కోలీవుడ్ బాక్స్ ఆఫీస్ ఫలితం తెలిసిపోతుంది కాబట్టి ఆ తర్వాత నిర్ణయం తీసుకునే ఆలోచనలో ఉన్నా ఆశ్చర్యం లేదు. ఒకవేళ అక్కడ హిట్ అయితే మాత్రం ఇక్కడ అడుగులు వేగంగా పడతాయి.

విడుదల కాకముందే దిల్ రాజు హక్కులు కొన్నారు అంటే కంటెంట్ చూసారో లేక ఒక అంచనా మీద దీన్ని కొనేశారో వేచి చూడాలి. ఒకవేళ కార్యరూపం దాలిస్తే నానిని సమంతాను మరోసారి జోడిగా చూడొచ్చు. తమిళ్ లో ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించగా గోవింద్ మీనన్ సంగీతం అందించారు. హీరో హీరోయిన్లు ఓకే అయ్యాక టెక్నీకల్ టీమ్ సెట్ చేయొచ్చు. ఇంతకీ 96 టైటిల్ లోనే ఏదో సస్పెన్స్ దాచి పెట్టిన ఈ మూవీ రొమాంటిక్ థ్రిల్లర్ అని టాక్.
Tags:    

Similar News