ఫైనల్ గా 'V' కే ఫిక్స‌య్యారు!

Update: 2019-04-29 04:20 GMT
నేచుర‌ల్ స్టార్ నాని- సుధీర్ బాబు క‌థానాయ‌కులుగా ఇంద్ర‌గంటి మోహ‌న్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న తాజా చిత్రానికి ఇంత‌కాలం టైటిల్ స‌స్పెన్స్ కొన‌సాగిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాకి వ్యూహం అనే టైటిల్ ఖ‌రారైందంటూ ప్ర‌చారం సాగినా.. ఎట్ట‌కేల‌కు `V` అనే టైటిల్ ని క‌న్ఫామ్ చేస్తూ చిత్ర‌ యూనిట్ టైటిల్ లోగోని రివీల్ చేసింది. `వీ` అనే టైటిల్ ని ఎంపిక చేసుకోవ‌డం వెన‌క చాలానే వ్యూహం ఉంద‌ని అర్థ‌మ‌వుతోంది.

తాజాగా టీమ్ రివీల్ చేసిన లోగోని జాగ్ర‌త్త‌గా ప‌రిశీలిస్తే.. బ్యాక్ గ్రౌండ్ లో ఓ ఠిఫిక‌ల్ గేమ్ సింబ‌ల్ క‌నిపిస్తోంది. అంటే.. ప‌ద్మ‌వ్యూహంలోకి వెళ్లడం ఎలా..?  అందులోంచి తిరిగి బ‌య‌ట‌ప‌డ‌డం ఎలా?  హీరో - విల‌న్ మ‌ధ్య వ్యూహం- ప్ర‌తి వ్యూహం ఏంటి? అన్న అర్థం ఇందులో క‌నిపిస్తోంది. అంటే వీ అనే టైటిల్ తోనే టీమ్ చాలా లాజిక‌ల్ గా క‌థ‌ను రివీల్ చేసేశారు. మైండ్ గేమ్.. ఇంటెలెక్చువ‌ల్ క్వాలిటీస్ ని ఎలివేట్ చేసే ఠిఫిక‌ల్ క‌థాంశం ఇద‌ని అర్థం చేసుకోవ‌చ్చు. ది జెంటిల్ మేన్ త‌ర్వాత ఇంద్ర‌గంటి మ‌రో ఆస‌క్తిక‌ర క‌థాంశాన్ని ఎంచుకున్నార‌నే అర్థ‌మ‌వుతోంది. ఇక ఈ చిత్రాన్ని శ్రీ‌మ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ‌వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ సంస్థ అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్మించ‌నుంది. దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్స్ అంటూ ఓ ప్ర‌త్యేక‌మైన లోగోని పోస్ట‌ర్ పై ముద్రించారు. శిరీష్- ల‌క్ష్మ‌ణ్- హ‌ర్షిత్ రెడ్డి స‌హనిర్మాత‌లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అదితీరావ్ హైద‌రీ.. నివేద థామ‌స్ ల‌ను క‌థానాయిక‌లుగా ఫైన‌ల్ చేస్తూ పోస్ట‌ర్ పైనా పేర్లు ముద్రించ‌డం ఆస‌క్తిక‌రం. పీజీవిందా సినిమాటోగ్ర‌ఫీ.. ర‌వీంద‌ర్ క‌ళాద‌ర్శ‌క‌త్వం.. అమిత్ త్రివేది .. సంగీతం.. మార్తాండ్ కె ఎడిటింగ్ ఈ సినిమాకి పెద్ద ప్ల‌స్ కానున్నాయి.

ఇటీవ‌ల తెలుగు సినిమా టైటిళ్ల‌ను ప‌రిశీలిస్తే వాటిలో సృజ‌నాత్మ‌క‌త ఆక‌ట్టుకుంటోంది. మెగా క్యాంప్ చిరు వారియ‌ర్ స్క్రిప్టు కోసం `ఉయ్యాలవాడ న‌ర‌సింహారెడ్డి` అనే టైటిల్ అనుకున్నా.. యూనివ‌ర్శ‌ల్ అప్పీల్ కోసం `సైరా` అనే రెండ‌క్ష‌రాల‌ టైటిల్ ని ఎంచుకుని ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేసింది. తాజాగా `వీ` అనే సింగిల్ లెట‌ర్ టైటిల్ తో దిల్ రాజు కాంపౌండ్ ఆస‌క్తిని పెంచ‌డంలో స‌ఫ‌ల‌మైంది. ఈ టైటిల్ లోనూ యూనివ‌ర్శ‌ల్ అప్పీల్ క‌నిపిస్తోంది. ఎంచుకున్న క‌థాంశం ఒక రెజియ‌న్ కే కాకుండా అన్ని భాష‌ల‌కు సూట‌వుతుందా? అన్న‌ది చిత్ర‌యూనిట్ చెప్పాల్సి ఉంది.
Tags:    

Similar News