నాని దసరా పుష్పలా కనెక్ట్ చేయగలడా..?

Update: 2023-01-06 04:44 GMT
నేచురల్ స్టార్ నాని కెరీర్ లో ఫస్ట్ టైం రిస్క్ తీసుకుని మరీ ఒక సినిమాని తన మార్కెట్ పరిధి దాటి ఖర్చు చేస్తున్నాడు. శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో నాని చేస్తున్న దసరా మూవీ నాని కెరీర్ లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ తో వస్తుంది. ఈ సినిమా కథ విన్నప్పటి నుంచి నాని సినిమా కోసం తీసుకునే ప్రతి స్టెప్ చాలా క్లవర్ గా ఉన్నట్టు అర్ధమవుతుంది. దసరా ఓ మాస్ మూవీ.. తెలంగాణా పీరియాడికల్ మూవీ.. నాని కి డైరెక్టర్ కథ చెప్పినప్పుడే తన పాత్ర తాలూకు ఆలోచనలు డైరెక్టర్ తో పంచుకున్నాడట నాని. అలా తన రఫ్ లుక్.. గడ్డం.. గుబురు జుట్టు నానిని కొత్తగా చూపించబోతున్నారు.

ఈమధ్య కాలం లో కథ కన్నా హీరోల క్యారెక్టరైజేషన్ మీద సినిమాలు ఆడేస్తున్నాయి. అందుకు బెస్ట్ ఎక్సాంపుల్ పుష్ప సినిమా. పుష్ప రాజ్ మాస్ యాటిట్యూడ్ వల్లే ఆ సినిమా ఆ రేంజ్ హై వచ్చింది. అఫ్కోర్స్ బన్నీ కూడా పుష్ప రాజ్ పాత్రలో ఇరగ్గొట్టేశాడు అనుకోండి.

అదేవిధంగా నాని దసరా సినిమాలో కూడా తన పాత్ర హైలెట్ అవుతుందట. అందుకే నాని దసరా కోసం స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. రీసెంట్ గా జరిగిన తన ఫ్యాన్స్ మీట్ లో కూడా దసరా గెటప్ లోనే కనిపించాడు. ఎందుకంటే ఈ సినిమాలో తన పాత్ర చాలా రోజులు వరకు గుర్తుండిపోతుందని అలా చేశాడట నాని.

సో దసరా విషయంలో నాని లెక్కలు అలా ఉన్నాయి. దసరా లో నాని పుష్ప రాజ్ పాత్ర తరహా యాటిట్యూడ్ తో ఆకట్టుకుంటే మాత్రం దసరా మరో పుష్ప అవుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. దసరా కథ కూడా చాలా గ్రిప్పింగ్ గా రాసుకున్నట్టు తెలుస్తుంది. సినిమాలో నాని పాత్రే మేజర్ హైలెట్ అనేలా చేస్తుండగా హీరోయిన్ కీర్తి సురేష్ రోల్ కూడా ఇంప్రెస్ చేస్తుందని అంటున్నారు.

ఆల్రెడీ ధూమ్ ధామ్ పాటతో ధూమ్ ధామ్ చేస్తున్న నాని సినిమాలో ఊర మాస్ యాక్టింగ్ తో ఉక్కిరిబిక్కిరి చేస్తాడని అంటున్నారు. దసరా నాని నట విశ్వరూపం చూస్తారని చిత్ర యూనిట్ టాక్. మరి ఇంత హైప్ ఇస్తున్నారు అంటే నాని పుష్ప లాంటి హిట్ కొట్టేస్తాడేమో చూడాలి.

నాని మార్క్ ఎంటర్టైన్ మెంట్ తో పాటుగా ఈ సినిమాలో మరో కొత్త నానిని చూస్తారని అంటున్నారు. కొత్త దర్శకుడు.. కొత్త కథ.. నాని దసరా నిజంగానే అద్భుతాలు చేస్తే మాత్రం అంతకుమించిన విక్టరీ మరోటి ఉండదు. నాని ఈ సినిమాని ఎలా హ్యాండిల్ చేస్తాడో చూడాలి. దసరా కేవలం తెలుగు సినిమానే కాదు పాన్ ఇండియా రేంజ్ లో మోత మోగించడానికి వస్తుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News