ఆ హీరో లెవల్ కి నా కథలు సరిపోవు.. ఎందుకంటే: రావిపూడి

ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో అనిల్ రావిపూడి జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేయడం గురించి రియాక్ట్ అయ్యారు.

Update: 2025-02-01 05:59 GMT

రాజమౌళి తర్వాత తెలుగులో 100 శాతం సక్సెస్ రేట్ తో దూసుకుపోతున్న దర్శకుడు అనిల్ రావిపూడి. ప్రేక్షకులకి నచ్చే ఎంటర్టైన్మెంట్ జోనర్ ని పట్టుకొని దాంట్లోనే మెజారిటీ మూవీస్ చేసి అనిల్ రావిపూడి హిట్స్ అందుకున్నాడు. తాజాగా రిలీజ్ అయిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. విక్టరీ వెంకటేష్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ మూవీగా ఈ చిత్రం నిలిచింది.

నెక్స్ట్ అనిల్ రావిపూడి మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేసే ప్లాన్ లో ఉన్నారు. ఇప్పటికే ఈ మూవీ స్క్రిప్ట్ ఫైనల్ అయిపోయినట్లు టాక్ వినిపిస్తోంది. అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్టైనర్ గానే ఈ చిత్రం ఉండబోతోందని సమాచారం. ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో అనిల్ రావిపూడి జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేయడం గురించి రియాక్ట్ అయ్యారు.

ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్ గా వరల్డ్ వైడ్ గా స్టామినా చూపించే స్టేజ్ లో ఉన్నాడు. హిందీలో కూడా జూనియర్ ఎన్టీఆర్ కి మంచి మార్కెట్ ఉంది. అయితే జూనియర్ ఎన్టీఆర్ కి సరిపోయే రేంజ్ లో ఇప్పుడు నా కథలు లేవు. నేను ఇప్పుడు చేస్తోన్న జోనర్ లో కంఫర్ట్ గా ఉన్నాను. ఒక వేళ జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేయాలంటే ఆయనకి సరిపోయే స్టోరీస్ కొత్తగా రాయాలి. పాన్ ఇండియా లెవల్ లో యూనివర్సల్ గా అందరికి రీచ్ అయ్యే కథ, వరల్డ్ బిల్డింగ్ ఉండాలి.

అలాంటి కథ రాసుకున్నప్పుడు కచ్చితంగా చేస్తాను. గతంలో 2, 3 సార్లు ఇద్దరం కలిసి మూవీ చేయాలని అనుకున్నాం అయితే కొన్ని కారణాల వలన వర్క్ అవుట్ కాలేదు. అయితే రెండు మూడేళ్ళ తర్వాత మాత్రం చేస్తాను. అందరి హీరోలతో సినిమాలు చేయాలని నాకుంది. అయితే వారిని ఎగ్జైట్ చేసే స్టోరీ నేను రెడీ చేసి వారికి నచ్చేలా చెప్పాలి. అప్పుడే మా కాంబినేషన్ లో మూవీ సాధ్యం అవుతుందని అనిల్ రావిపూడి ఇంటర్వ్యూలో చెప్పారు. ఇప్పటికైతే ప్రస్తుతం ఉన్న జోన్ లో నేను కంఫర్ట్ గా జర్నీ చేస్తున్నాను.

చిరంజీవి గారితో మూవీకి సంబంధించి డిస్కషన్స్ అవుతున్నాయి. అయితే స్క్రిప్ట్ మొత్తం ఫైనల్ అయ్యాక, మా ఇద్దరం ఎగ్జైట్ అయ్యేటపుడు అది మెటీరియలైజ్ అవుతుంది. ఏ విషయం అయిన ముందే చెప్పడం కరెక్ట్ కాదు. అంతా సెట్ అయ్యాక ఒకేసారి ఎనౌన్స్ చేస్తే బాగుంటుందని అనిల్ రావిపూడి అన్నారు.

Tags:    

Similar News