నాని ఎంత మంచి నటుడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఓ కామెడీ సీన్ తో కితకితలు పెట్టిన వెంటనే ఎమోషనల్ సీన్ తో ఏడిపించేయడం అతడికే చెల్లుతుంది. భలే భలే మగాడివోయ్ సినిమాలోనూ ఆద్యంతం నవ్విస్తాడు. ఐతే అలా నవ్విస్తూ నవ్విస్తూనే.. ప్రి క్లైమాక్స్ సడెన్ గా కన్నీళ్లు పెట్టించేస్తాడు. ఓ కామెడీ సినిమాలో అలాంటి ఎమోషనల్ సీన్ ఏంటని ఎవరికీ ఎబ్బెట్టుగా అనిపించకుండా చేయడమే నాని ప్రత్యేకత. ఐతే ఈ ఎమోషనల్ సీన్ వెనుక కొన్ని ఆసక్తికర విశేషాలు బయటికి వచ్చాయి. ఈ సీన్ చాలా ప్రత్యేకంగా ఉండాలన్న ఉద్దేశంతో ముక్కలు ముక్కలుగా చేసి.. 8 గంటల పాటు చిత్రీకరించాలని అనుకున్నాడట దర్శకుడు మారుతి. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 వరకు నాని కాల్ షీట్ కూడా తీసుకున్నాడట.
కానీ అంత రెడీ చేసుకుంటే కేవలం ఐదు నిమిషాల్లో ఈ సీన్ ముగించేశాడట నాని. ఈ సన్నివేశం గురించి నాని చెబుతూ.. ‘‘ఈ సన్నివేశాల్లో చాలా ఎమోషన్ ఉంటుంది. ఈ సీన్ లెంగ్త్ నాలుగున్నర నిమిషాలు. మొత్తం ఒకేసారి షూట్ చేయడం కన్నా బిట్స్ అండ్ పీసెస్ తరహాలో సన్నివేశాలు చేయాలనుకున్నాడు మారుతి. ఐతే అలా ఆపి ఆపి చేస్తే ఎమోషన్ క్యారీ చేయడం కష్టమనిపించింది. ఆ సంగతే మారుతికి చెబితే.. రెండు పేజీల డైలాగులున్నాయని.. ఎమోషన్ క్యారీ చేస్తూ ఈ డైలాగులన్నీ ఒకేసారి చెప్పడం కష్టమన్నాడు. కానీ నేను చేద్దామన్నాను. 9.45కి సీన్ మొదలైంది. 9.50కి పూర్తయిపోయింది. అందరూ క్లాప్స్ కొట్టారు. మారుతి దాదాపు కన్నీళ్లు పెట్టుకున్నంత పని చేశాడు. గట్టిగా ప్యాకప్ అని అరిచి నన్ను హత్తుకున్నాడు. ఇంతకుముందు ఎటో వెళ్లిపోయింది మనసు సినిమాకు లెంగ్తీ ఇంటర్వెల్ సీన్ చేశా. కానీ అప్పుడు కెమెరా నా ముందు లేదు. ఎక్కడో పెట్టారు. కానీ ఈ సన్నివేశానికి మాత్రం నా ముఖం ముందే కెమెరా ఉంది. అలా ఉన్నపుడు ఎమోషన్స్ పండించడం కష్టమైంది’’ అన్నాడు నాని.