మీడియాకు ఎప్పుడో ఏదో సెన్సేషన్ కావాలి. కరోనా వేళ షూటింగ్ ల గురించి పెద్దగా చెప్పుకునేందుకు ఏమీ ఉండదు కాబట్టి ఏదో వార్త క్రియేట్ చేసుకోవాల్సిందే. ఆ క్రమంలో కొన్ని నిరాధార వార్తలు మీడియాని ఏలుతూంటాయి. అయితే చాలా వరకు ఆ వార్తలను సినిమావాళ్లు పెద్దగా పట్టించుకోరు. ఉన్నంతలో తమ సినిమాకు ఏదో విధంగా పబ్లిసిటీ జరుగుతోంది కదా అనే అనుకుంటారు. కాని కొన్ని వార్తలు వేలెత్తి పొడిచినట్లుంటాయి. అలాంటి వార్త ఒకటి నాని చెవిని పడిందిట. ఆ వార్త విని ఆయన మండిపడుతున్నారు అంటున్నారు. ఇంతకీ ఏమిటా వార్త అంటే...
'నిన్ను కోరి' వంటి సక్సెస్ ఫుల్ చిత్రం తరువాత నేచురల్ స్టార్ నాని, టాలెంటెడ్ డైరెక్టర్ శివ నిర్వాణ కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమా 'టక్ జగదీష్'. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో నానికి అన్నయ్యగా జగపతిబాబు నటిస్తుండగా.. రీతూ వర్మ, ఐశ్వర్యా రాజేశ్ హీరోయిన్స్ గా చేయనున్నారు. గత కొంతకాలంగా సరైన హిట్ లేని నాని 'టక్ జగదీష్' పై చాలా హోప్స్ పెట్టుకున్నాడు. ఆ సినిమా తనని సక్సెస్ ట్రాక్ లోకి తీసుకువస్తుందని నమ్ముతున్నాడు.
ఈ నేపధ్యంలో సంక్రాంతికి కొద్ది రోజుల ముందు ఏప్రిల్ 16న 'టక్ జగదీష్' థియేటర్స్ లోకి రాబోతుందంటూ చిత్ర యూనిట్ ప్రకటించింది. అయితే అదే ఏప్రిల్ 16కి నాగచైతన్య, శేఖర్ కమ్ముల ఫస్ట్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 'లవ్ స్టోరీ' కూడా రాబోతుందని అనౌన్స్ మెంట్ వచ్చింది. దాంతో.. 'టక్ జగదీష్' విడుదలని ఏప్రిల్ 23కి ఈ సినిమా వాయిదా వేసారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతున్న నేపథ్యంలో ఈనెల 23న విడుదల కావాల్సిన 'టక్ జగదీష్' వాయిదా పడింది.
కరోనా మహమ్మారి విజృంభణతో థియేటర్లు మూత పడుతున్నాయి. దీంతో 'టక్ జగదీష్'ను ఓటిటిలో విడుదల చేసే అవకాశం ఉండొచ్చనే చర్చ మొదలెట్టింది టాలీవుడ్ మీడియా. అయితే 'టక్ జగదీష్' ఓటిటి రిలీజ్ గురించి ఆ చిత్రం టీమ్ లో ఎవరూ ఆలోచించలేట. దాంతో ఈ వార్తలు చూసి నానికి చాలా కోపం వచ్చింది. ఎందుకంటే ఓటీటీ రిలీజ్ కు నాని సుముఖంగా లేరు. ఇంతకుముందు నాని హీరోగా నటించిన 'వి' చిత్రాన్ని ఓటిటి వేదికపై విడుదల చేశారు. అయితే ఆ చిత్రం నానికి చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఈ క్రమంలో ఓటిటిలో విడుదల అంటే నాని అస్సలు ఇష్టపడటం లేదుట. ఆ టాపిక్ ని కూడా తేవటానికి ఆసక్తి చూపించటంలేదు. మీడియావారు అత్యుత్సాహంతో ఓటీటి రిలీజ్ అనటంతో నానిని ఇబ్బంది పెడుతోంది. నానితో పాటు చిత్ర నిర్మాతలు కూడా ఏదేమైనా ఈ చిత్రాన్ని థియేటర్లోనే విడుదల చేయాలని భావిస్తున్నారని సమాచారం.
నాని సరసన రీతువర్మ హీరోయిన్ గా నటించగా, జగపతిబాబు, ఐశ్వర్యా రాజేశ్, నాజర్, రోహిణి, దేవదర్శిని, నరేశ్, రావు రమేశ్ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కు తమన్ స్వరాలూ సమకూర్చాడు. శివ నిర్వాణ దర్శకత్వంలో సాహు గారపాటి, హరీశ్ పెద్ది ఈ సినిమాను నిర్మించారు.