నేచురల్ స్టార్ నాని హీరోగా రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం “శ్యామ్ సింగ రాయ్”. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ నేపథ్యంలో గురువారం చిత్ర బృందం టీజర్ లాంచ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఇందులో భాగంగా సినిమా టీజర్ ను ఒకేసారి తెలుగు తమిళ కన్నడ మలయాళ భాషల్లో విడుదల చేశారు. అనంతరం మీడియా సమావేశంలో విలేఖరులు అడిగిన ప్రశ్నలకు నాని సమాధానమిచ్చారు.
* 'టక్ జగదీష్' 'వి' సినిమాలు ఓటీటీలో విడుదలైన తర్వాత 'శ్యామ్ సింగ రాయ్' తో థియేటర్ లోకి వస్తున్నారు? ఎలా అనిపిస్తుంది?
- ఈ సినిమాతో తప్పకుండా సక్సెస్ అందుకుంటామని నమ్ముతున్నాను. క్రిస్మస్ నాకెంతో స్పెషల్. గతంలో క్రిస్మస్ సందర్భంగా వచ్చిన 'ఎంసీఏ' సినిమా ఎలాంటి హిట్ అయిందో మీకు తెలుసు. ఇప్పుడు అదే సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందని నమ్ముతున్నాను.
*ఈ సినిమా కథ బెంగాలీ నేపథ్యంలో ఉంటుందా?
- ఇదొక భిన్నమైన లవ్ స్టోరీ. ఎపిక్ లవ్ స్టోరీ. బెంగాలీ నేపథ్యంలోనే ఉంటుంది. కానీ డైలాగ్స్ అన్నీ బెంగాలీలో ఉండవు. ఒక్క డైలాగ్ ఉంటే అది కూడా టీజర్ లో వచ్చింది. మిగిలినవి అక్కడక్కడ వస్తుంటాయి. ఇప్పుడే ఈ విషయం చెప్పొచ్చో లేదో తెలీదు.. మీకున్న కొన్ని అనుమానాలు తీర్చడానికి చెబుతున్నా.. ఈ సినిమాలో శ్యామ్ వాళ్ల అమ్మ తెలుగు.. నాన్న బెంగాలీ. అందుకే అతను బెంగాలీలో మాట్లాడుతుంటాడు.
* 'రాయాలన్నా, కాల రాయాలన్నా..' అని మొదటి సారి ప్రెస్ చేసి చెప్పినట్టుంది. 'శ్యామ్ సింగ రాయ్' లో మీ పాత్ర ఎలా ఉండబోతోంది?
- మీరు బాగా కనెక్ట్ అయినట్టున్నారు కదా ఈ డైలాగ్ కు (నవ్వుతూ). మీడియాకు ఉన్న పవర్ అది 'రాయాలన్నా, కాల రాయాలన్నా'.. మీరంతా ఇది నా బయోపిక్ అనుకుంటున్నారేమో. కాదు.. ఇది మీ బయోపిక్ కాదు. సినిమాలో నా పాత్రకు సంబంధించి రైటర్ ఎలిమెంట్ ఉంది. ఎక్కువ రివీల్ చేయకూడదు కాబట్టి టీజర్ అంటున్నాం. థియేట్రికల్ ట్రైలర్ లో మరికొన్ని వివరాలు అందిస్తాం.
* 'ఎంసీఏ' తర్వాత సాయిపల్లవితో కలిసి వర్క్ చేయడం ఎలా ఉంది?
- సాయి పల్లవితో కలిసి మరోసారి స్క్రీన్ షేర్ చేసుకోవడం ఆనందంగా ఉంది. 'ఎంసీఏ' తో బ్లాక్ బస్టర్ అందుకున్నాం. ఇప్పుడు డిసెంబర్ 24న ఏం జరగనుందో నాకు బాగా తెలుసు. హిట్ కాంబినేషన్ గా మేము మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను.
ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ.. ''రెండేళ్ల తర్వాత థియేటర్ కి వస్తున్నామంటే ఈ మాత్రం ఉండాలి. టీజర్ రిలీజ్ కోసం ఈ రోజు మీ అందర్నీ చూడటం, మీ అరుపులు వినడంతో నా కడుపు నిండిపోయింది. దీని కోసమే కదా మేము కష్టపడి పనిచేసేది. కరెక్ట్ సినిమాతో వస్తున్నా.. క్రిస్మస్ మాత్రం మనదే. ఇలాంటి మంచి సినిమాలో భాగమైనందుకు నాకెంతో ఆనందంగా ఉంది. మీ అందరితో కలిసి ఈ సినిమా ఫస్ట్ డే మార్నింగ్ షో చూసేందుకు ఎదురుచూస్తున్నాను. మీ ఎనర్జీ దాచి పెట్టుకోండి. క్రిస్మస్ మనదే'' అని అన్నారు.
కాగా, 'శ్యామ్ సింగ రాయ్' చిత్రంలో సాయి పల్లవి - కృతి శెట్టి - మడోనా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటించారు. నిహారిక ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై వెంకట్ బోయనపల్లి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇది నాని కెరీర్ లో బిగ్గెస్ట్ ఫిల్మ్. సత్యదేవ్ జంగా దీనికి కథ అందించారు. మిక్కీ జె మేయర్ సంగీతం సమకూర్చారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు మంచి స్పందన తెచ్చుకోగా.. లేటెస్టుగా వచ్చిన టీజర్ సినిమాపై అంచనాలు పెంచేసింది.