నానీనే రైట్ ఛాయిస్.. ఎందుకంటే?

Update: 2018-02-20 23:30 GMT
గత ఏడాది ఎన్నెన్నో సందేహాల మధ్య మొదలైన షో ‘బిగ్ బాస్’.. అంచనాల్ని తలకిందులు చేస్తూ సూపర్ సక్సెస్ అయింది. రెండున్నర నెలల పాటు చాలామంది ఆ షోతో ఎమోషనల్ ట్రావెల్ చేశారు. ఆ షో ముగియగానే చాలామంది అయోమయ స్థితికి చేరారు. ఏదో కోల్పోయిన ఫీలింగ్ లో పడిపోయారు. రోజూ అలవాటు పడ్డ వినోదం మిస్సయ్యేసరికి ఏదోలా అనిపించింది వాళ్లకు. మళ్లీ బిగ్ బాస్ ఎప్పుడొస్తుందా అని ఆసక్తిగా చూడటం మొదలుపెట్టారు. వాళ్లను మళ్లీ అలరించడానికి ఇంకొన్ని నెలల్లోనే బిగ్ బాస్ రెండో సీజన్ రాబోతోంది. కానీ తొలి సీజన్ ను అద్భుతంగా నడిపించిన ఎన్టీఆర్ ఈసారి షోలో ఉండబోడన్న వార్త అభిమానులకు రుచించడం లేదు.

కానీ తారక్ కు ఉన్న కమిట్మెంట్ల దృష్ట్యా అతను ఈ షో చేయడం సందేహమే. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ ప్లేస్ ను రీప్లేస్ చేసేదెవరు అనే చర్చ మొదలైంది. ఎన్టీఆర్ లాగా స్టేచర్ ఉండి.. చలాకీగా షోను నడిపించే వాళ్లెవ్వరా అని చూస్తే అందరికీ చాలామందికి అల్లు అర్జున్ కనిపిస్తున్నాడు. అదే సమయంలో స్టార్ ఇమేజ్ ఆ స్థాయిలో లేకపోయినా.. వాక్చాతుర్యం ఉండి.. జనాలతో ఇట్టే కలిసిపోయే నైజం ఉన్నదెవరంటే నానీ కనిపిస్తున్నాడు. మరి ఈ ఇద్దరిలో ఎవరు బెస్ట్ అనే విషయంలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. అల్లు అర్జున్ చలాకీగానే ఉంటాడు కానీ.. ఎన్టీఆర్ లాగా వాక్చాతుర్యంతో.. ఈజ్ తో షోను నడిపించగలడా అంటే సందేహమే. నిజానికి బన్నీ కెమెరా ముందున్నంత ఉత్సాహంగా బయట ఉండడు. మాట్లాడ్డానికి సిగ్గు పడతాడు. ఎన్టీఆర్ లాగా ఫ్లో అతడికి ఉండదు. మరో సమస్య ఏంటంటే.. ఎన్టీఆర్ తో ‘బిగ్ బాస్’ అభిమానులకు ఎమోషనల్ కనెక్ట్ ఉంది. అతడి పేరెత్తకుండా.. మధ్య మధ్యలో అతడి ప్రస్తావన రాకుండా.. గత సీజన్లో అతడి నైపుణ్యాన్ని పొగడకుండా ఈసారి షోను నడిపించడం కుదరదు. అది బాగోదు కూడా. అల్లు అర్జున్ అది చేయగలడా అంటే సందేహమే. కానీ నానీకి ఈ ఇబ్బంది లేదు. ఎన్టీఆర్‌ ను పొగడ్డానికి అతడికి ఏ ఇబ్బందీ లేదు. ఇక అతడి వాక్చాతుర్యం.. ఈజ్ గురించి కొత్తగా చెప్పేదేముంది..? దగ్గుబాటి రానా అయినా బాగానే ఉంటుంది కానీ.. పర్ఫెక్ట్ ఛాయిస్ ఎవరంటే మాత్రం నాని పేరే చెప్పాలి.
Tags:    

Similar News