ఆ ఇద్దరికీ జెర్సీ గండం

Update: 2019-04-20 05:47 GMT
నిన్న విడుదలైన నాని జెర్సీ ప్రశంసల వర్షంలో తడిసి ముద్దవుతోంది.సామాన్య ప్రేక్షకులు మొదలుకుని సెలెబ్రిటీల దాకా ప్రత్యేకంగా సమయం తీసుకుని మరీ పొగడ్తలను కురిపిస్తున్నారు. ఈ వీకెండ్ లోపే స్క్రీన్ల కౌంట్ భారీగా పెరగొచ్చనే అంచనాలో ట్రేడ్ ఉంది. దానికి తగ్గట్టు మొదటి రోజు కన్నా రెండు మూడో రోజు బుకింగ్స్ భారీగా ఉండటం పరిస్థితిని సూచిస్తోంది.

ఇప్పుడీ జెర్సీ వేగం ఇద్దరికీ గండంగా మారే ఛాన్స్ కనిపిస్తోంది. ఒకరు సాయి తేజ్. వారం క్రితం విడుదలైన చిత్రలహరి తేజుకు రిలీఫ్ ఇచ్చే దిశగా వసూళ్లు రాబడుతూ సేఫ్ వెంచర్ అనిపించుకునే వైపుగా వెళ్తోంది. భారీ బ్లాక్ బస్టర్ కాకపోయినా తేజ్ గత సినిమాల కంటే ఇది చాలా మెరుగ్గా పెర్ఫార్మ్ చేసింది. ఇప్పుడు జెర్సీ ప్రభంజనం దీనికి అడ్డుకట్ట వేసే అవకాశాన్ని కొట్టిపారేయలేం

ఇక రెండు వారాల క్రితం వచ్చినా మజిలి ఇప్పటికీ చాలా చోట్ల స్ట్రాంగ్ గా ఉంది. చైతు సమంతాల ఎమోషనల్ ఆన్ స్క్రీన్ బాండింగ్ కి వసూళ్లు భారీగా దక్కాయి. ఇంకో పది రోజులు ధోకా లేదు అనుకుంటున్న టైంలో ఇప్పుడు జెర్సీ రూపంలో స్పీడ్ బ్రేకర్ అడ్డు పడుతోంది. ఎంత లేదనుకున్నా ప్రభావం అయితే ఖచ్చితంగా ఉంటుంది.

ఇంకా మజిలి చూడని ప్రేక్షకులు ఒకే ఆప్షన్ ఎంచుకోవాల్సి వస్తే జెర్సీ వైపే టర్న్ కావొచ్చని విశ్లేషకుల అభిప్రాయం. ఈ అంచనాలు నిజమైతే చిత్రలహరి-మజిలి రెండింటికి జెర్సీ సవాల్ గా నిలుస్తుంది. ఇది ఎంత శాతంలో ఉంటుంది అనేది పై రెండు సినిమాలకు నమోదైన డ్రాప్ పర్సెంటేజ్ ని పరిగణనలోకి తీసుకుని చెప్పొచ్చు. అది తేలాలంటే మాత్రం ఇంకొద్ది రోజులు ఆగాలి
Tags:    

Similar News