అవును.. నేచురల్ స్టార్ నాని నటించిన మజ్ను మొదటి రోజున కలెక్షన్స్ తో ముంచెత్తాడు. ఒకవైపు రెండు తెలుగు రాష్ట్రాలను వర్షాలు ముంచెత్తుతుంటే.. వాటిని లెక్క చేయకుండా మజ్నుకి కలెక్షన్స్ వదర పారింది. ముఖ్యంగా తెలంగాణలో అయితే.. అన్ని జిల్లాల్లోనూ భారీ వర్షాలు పడుతున్నా.. హైద్రాబాద్ లో సిట్యుయేషన్ దారుణంగా ఉన్నా భారీ కలెక్షన్స్ వచ్చేయడం విశేషం.
తొలి రోజున నైజాం ఏరియా నుంచి మొత్తం రూ. 1.05 కోట్లు షేర్ వచ్చింది. ఏపీ వ్యాప్తంగా చూసుకుంటే ఇది రూ. 1.50 కోట్లుగా లెక్క తేలింది. అంటే నాని సినిమాకి రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు వచ్చిన టోటల్ కలెక్షన్ రూ. 2.55 కోట్లన్న మాట. ఇంత భారీ వర్షాల్లో ఇంత మొత్తం కలెక్ట్ చేయడమంటే అది నానికే చెల్లిందని అంటున్నారు ట్రేడ్ జనాలు. మజ్ను టాక్ కి బాగానే ఉన్నా.. మరీ గొప్పగా ఏం లేదు. అయితే.. మొదటి వారం ముగిసేనాటికే ఇది సేఫ్ ప్రాజెక్ట్ అయిపోతుందనే టాక్ వినిపిస్తోంది.
తొలిరేజే ఈ రేంజ్ వసూళ్లు రావడంతో.. వీకెండ్ లో మరింతగా ఈ కలెక్షన్స్ పెరిగే ఛాన్స్ ఉంది. విరించి వర్మ డైరక్షన్ లో అను అమాన్యుయేల్.. ప్రియాశ్రీలు హీరోయిన్ లుగా నటించన ఈ మూవీ.. నాని హిట్ ట్రాక్ ని కంటిన్యూ చేస్తోంది. ఈ ఏడాది వరుసగా మూడో సినిమాతో హిట్ ఇచ్చి హ్యాట్రిక్ ఇచ్చేశాడు నాని.