అమ్మ ఫీల్ తో టచ్ చేసావ్ నాని

Update: 2018-03-31 09:47 GMT
న్యాచురల్ స్టార్ నాని సినిమాల్లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా చాలా సింపుల్ గా అదే నవ్వుతో అందరిని ఆహ్లాదపరుస్తూ ఉండటం అతనితో వర్క్ చేసిన వాళ్ళకే కాదు కలిసిన అభిమానులకు కూడా బాగా తెలుసు. సోషల్ మీడియాలో ట్విట్టర్ ద్వారా రెగ్యులర్ టచ్ లో ఉండే నాని తన పర్సనల్ విషయాలు షేర్ చేసుకోవడానికి ఏ మాత్రం మొహమాటపడడు. తాజాగా తన తల్లి విజయలక్ష్మితో షేర్ చేసుకున్న ఒక మెమరీ ఇప్పుడు వైరల్ అవుతోంది. నాని తల్లి గారు ఒక ప్రముఖ హాస్పిటల్ లో ఫార్మసిస్ట్ అన్న సంగతి కొందరికే తెలుసు. చాలా ఇంటర్వ్యూలలో తన బలం అమ్మే అని చెప్పిన నాని ఏనాడూ ఆవిడ ఎక్కడ జాబ్ చేస్తున్నారో మాత్రం బయట పెట్టలేదు. నానిని కలిసే ప్రయత్నాల కోసం ఆవిడను ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది కాబట్టి నాని ఇన్నాళ్ళు గుట్టుగానే ఉంచాడు.

ఇప్పుడు విజయలక్ష్మి గారు రిటైర్ అయ్యారు. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని తన తల్లితో పక్కన కూర్చుని చుట్టూ మందులు పోగేసి ఇచ్చిన స్టిల్ ఎమోషనల్ గా ఉంది. తన తల్లిని డాక్టర్లు-పేషంట్లు అందరూ ప్రేమించారని అందరి కన్నా ఎక్కువగా తాను ప్రేమించానని చెప్పిన నాని తన జీవితంలో చూసిన అద్భుతమైన అందమైన వ్యక్తి అమ్మే అని ఫినిషింగ్ టచ్ ఇవ్వడం అందరి హృదయాలను టచ్ చేసింది. తన తల్లి రిటైర్ అవ్వడాన్ని ఇంత చక్కని మెసేజ్ లో సెలెబ్రేట్ చేసుకున్న నాని మీద ప్రశంశలు కురిపిస్తూ అమ్మకు విషెస్ చెబుతున్నారు ఫాన్స్. మొత్తానికి తన పాత్రల ద్వారానే కాదు ఇలా మాటల ద్వారా కూడా కదిలిస్తానని నాని మరోసారి రుజువు చేసాడు. నాని డ్యూయల్ రోల్ చేసిన కృష్ణార్జున యుద్ధం ఏప్రిల్ 12 విడుదలకు రంగం సిద్ధం చేసుకుంటోంది. మూడో సారి ద్విపాత్రాభినయం చేసిన సినిమా కాబట్టి అంచనాలు భారీగా ఉన్నాయి. 
Tags:    

Similar News