జంపింగ్ జపాంగ్ డైరెక్షన్ లో నాని

Update: 2016-05-26 09:21 GMT
నేచురల్ స్టార్ సినిమాలంటే ఆడియన్స్ కే కాదు ఇండస్ట్రీ జనాలకు కూడా ఆసక్తి ఉంటుంది. డిఫరెంట్ స్టోరీలను ఎంచుకుంటూ.. పర్టిక్యులర్ గా ఓ ఇమేజ్ కి కట్టుబడకుండా దూసుకుపోతున్నాడు నాని. ప్రస్తుతం రొమాంటిక్ థ్రిల్లర్ గా రూపొందిన జెంటిల్మన్ ను విడుదలకు సిద్ధం చేసిన ఈ యంగ్ హీరో.. ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్ ని ఫైనల్ చేసేశాడు.

సుధీర్ బాబుతో భలే మంచి రోజు అనే సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు శ్రీరామ్ ఆదిత్య. ఆ సినిమా ప్రేక్షకులను బాగానే థ్రిల్ చేసింది. అయితే.. ఆ తర్వాత రియల్ లైఫ్ లో అందరికీ మరింత థ్రిల్ ఇచ్చాడీ శ్రీరామ్ ఆదిత్య. మరికొన్ని రోజుల్లో పెళ్లి చేసుకోబోతున్న ఓ అమ్మాయిని.. ఈ డైరెక్టర్ తీసుకెళ్లిపోయాడనే టాక్ వచ్చింది. లేచిపోయాడని అందరూ అన్నా.. ఇష్టపడి పెళ్లి చేసుకుంటే లేచిపోయినట్లేనా అని తర్వాత నిలదీశాడు కూడా. ఆ డైరెక్టర్ తో ఇప్పుడు నాని జత కడుతున్నాడు.

ఇక్కడ అన్నిటి కంటే ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినది ఏంటంటే.. సున్నితమైన కుటుంబ అనుబంధాలు, విలువలను బేస్ చేసుకుని ఈ మూవీ ఉంటుందట. ఓవైపు రియల్ లైఫ్ లో ఇలాంటివి పాటించలేదని విమర్శలు ఎదుర్కుంటూ.. అదే సబ్జెక్ట్ పై సినిమా చేస్తుండడం విశేషం. అఫ్ కోర్స్.. హీరో నాని ఉన్నాడు కాబట్టి.. ఇలాంటి సబ్జెక్టులని హ్యాండిల్ చేయడం కష్టం కాదేమో కదూ.
Tags:    

Similar News