లోకల్ నాని.. అన్ని ఏరియాల్లో కేకల్

Update: 2017-02-05 04:34 GMT
హీరో నాని నటించిన లేటెస్ట్ మూవీ నేను లోకల్.. ఇప్పుడు సెన్సేషనల్ గా కేకల్ పెట్టిస్తోంది. ఫుల్లు పాజిటివ్ టాక్ తో మొదలుకావడంతో.. పెద్ద స్టార్లకు సమానంగా వసూళ్లు వచ్చేస్తున్నాయి. ముఖ్యంగా ఓవర్సీస్ లో అయితే.. అంచనాలకు మించి రాబడుతున్నాడు నేచురల్ స్టార్.

గురువారం నాడు ప్రీమియర్స్ ద్వారా 1,63,457 డాలర్లు రాబట్టిన నేను లోకల్.. రిలీజ్ డేట్ అయిన శుక్రవారం నాడు 1,90,422 డాలర్లు తీసుకొచ్చాడంటే.. ఈ ఏరియాలో నేను లోకల్ ఎంత స్ట్రాంగ్ గా ఉందో అర్ధమవుతుంది. మొత్తంగా ఇప్పటివరకూ కేవలం యూఎస్ నుంచే 2.38 కోట్ల గ్రాస్ రాబట్టగలిగింది నేను లోకల్ మూవీ. వీకెండ్స్ లో కూడా ఇదే జోరు కంటిన్యూ అయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. వీకెండ్ ముగిసేనాటికి కచ్చితంగా హాఫ్ మిలియన్ మార్క్ దాటేస్తుందని అంటున్నారు ట్రేడ్ జనాలు.

ఇటు ఏపీ తెలంగాణల్లో కూడా నేను లోకల్ కుమ్మేస్తోంది. కేవలం మొదటి రోజు కలెక్షన్స్ రూపంలోనే 4.5 కోట్ల రూపాయల షేర్ ను రాబట్టేసింది. మీడియం రేంజ్ హీరోల్లో తనే టాప్ పొజిషన్ లో ఉన్నానని ప్రూవ్ చేశాడు నాని. ఈ హీరో కెరీర్ లో ఇప్పటివరకూ ఇదే బిగ్గెస్ట్ ఓపెనింగ్ కావడం విశేషం. నాని-కీర్తి సురేష్ జంట ఆడియన్స్ ను బాగానే అలరిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News