నానిని చూసి మిగ‌తా హీరోలు నేర్చుకోవాలి?

Update: 2022-02-18 14:30 GMT
నేచుర‌ల్ స్టార్ నాని కెరీర్ ప్రారంభించి 14 ఏళ్లు అవుతుంది. అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి హీరోగా ప్ర‌మోట్ అయి తెలుగులో త‌న‌కంటూ  ఓ ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నారు. ఎలాంటి  బ్యాక్ గ్రౌండ్ లేకుండా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి స‌క్సెస్ అయిన హీరోల్లో నాని ఒక‌రు. మ‌రి ఇంత క‌ష్ట‌ప‌డి పైకి వ‌చ్చిన నాని కెరీర ప్లానింగ్ ఎంత ప‌క‌డ్భందీగా ఉంటుందో చెప్పాల్సిన ప‌నిలేదు. 14 ఏళ్ల కెరీర్ లోనే 30 సినిమాల‌కు ద‌గ్గ‌ర‌గా చేసాడు.

అవ‌కాశం వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా నిర్మాత‌గాను త‌న అభిరుచుని చాటుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు. కెరీర్ ప‌రంగా ఎత్తు ప‌ల్లాలు అంద‌రిలాగే నాని కూడా ఎదుర్కున్నాడు. అన్నింటికి ఎదుర్కుని ప్ర‌స్తుతానికి స‌క్సెస్ ట్రాక్ లో ప‌య‌నిస్తున్నాడు. ఇటీవ‌లే `శ్యామ్ సింగ‌రాయ్` చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చాడు. డిఫ‌రెంట్ కంటెంట్ జోన‌ర్ సినిమాగా విమ‌ర్శ‌కుల ప్ర‌శంలందుకుంది.

క‌మ‌ర్శియ‌ల్ గా యావ‌రేజ్ అయినా నాని బ్రాండ్ ఇమ‌జ్ కి మాత్రం ఎలాంటి ఢోకా లేదు. ఇక డై బై డే నాని సినిమాల నంబ‌ర్ పెరుగుతూనే ఉంది. కోవిడ్ కార‌ణంగా కొంత డిస్ట‌బెన్స్ ఏర్ప‌డిన‌ప్ప‌టికీ త‌న ప్లానింగ్ లో మాత్రం ఎక్క‌డా  డిస్ట‌బెన్స్ లేకుండా ముందుకు సాగిపోతున్నాడు. ఒక సినిమా సెట్ లో ఉండ‌గానే మ‌రో ప్రాజెక్ట్ ని లైన్ లోకి తెచ్చేస్తున్నాడు.

నాని సినిమాల రిలీజ్ లు దాదాపు కీల‌క‌మైన సీజ‌న్ల‌ను అన్నింటిని క‌వ‌ర్ చేసేస్తున్నాయ‌ని చెప్పొచ్చు. గ్యాప్ తీసుకోకుండా కొత్త ప్రాజెక్ట్ లు క‌మిట్ అవ్వ‌డం వాటిని వీలైనంత త్వ‌ర‌గే ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావ‌డంలో నాని ప్లానింగ్ అనేది ప‌క్కాగా ఎగ్జిక్యూట్ చేయ‌గ‌ల్గుతున్నాడు. గ‌త మూడు నాలుగేళ్ల‌గా నాని రిలీజ్ చేసిన సినిమాలు ఒకే ఏడాది ఏప్రిల్..సెప్టెంబ‌ర్ లోనే ఎక్కువ‌గా   రిలీజ్ అయ్యాయి.

గ‌త ఏడాది సెప్టెంబ‌ర్ లోనే `ట‌క్ జ‌గ‌దీష్` రిలీజ్ అయింది.  మ‌రో రెండు నెల‌లు గ్యాప్ అనంత‌రం `శ్యామ్ సింగ‌రాయ్`  డిసెంబ‌ర్ లో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ప్ర‌స్తుతం `ద‌స‌రా` చిత్రంలో  న‌టిస్తున్నాడు. నూత‌న ద‌ర్శ‌కుడు శ్రీకాంత్ ఓదెల ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. ప‌క్కా క‌మ‌ర్శియ‌ల్ ఎంట‌ర్ టైన‌ర్ . ఈ చిత్రాన్ని ద‌స‌రా పండుగ రోజున గానీ..సెంటిమెంట్ గా సెప్టెంబ‌ర్ లో గాని రిలీజ్ అయ్యే అవ‌కాశం ఉంది. లేక గ్యాప్ ఎక్కువ వ‌స్తుంద‌నుకుంటే అంత‌కంటే  ముందే రిలీజ్ అయ్యే చాన్స్ ఉంది.

 తాజాగా నాని సినిమాల జాబితాని  చూసి మిగ‌తా యంగ్ స్టార్ హీరోలు నేర్చుకోవాల్సిన ఆవ‌శ్య‌క‌త ఎంతైనా ఉంద‌న్న ఓ విమ‌ర్శ వినిపిస్తోంది. నేచుర‌ల్ స్టార్ లా మిగ‌తా హీరోలు కూడా సీజ‌న్ కి ఒక సినిమా రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేసుకుంటే బాగుంటుంద‌నే ఫీడ్ బ్యాక్ వ‌స్తోంది. సీజ‌న‌ల్ రిలీజ్ ల వ‌ల్ల సినిమాకి క‌లిసొచ్చే అంశం. సినిమా ఎలా ఉన్న క‌నీస వ‌సూళ్లు తెచ్చే అవ‌కాశం ఉంది. అన్నింటిని మించి సినిమా-సినిమాకి గ్యాప్ త‌గ్గే అవ‌కాశం ఉంది.

ప్రేక్ష‌కుల మ‌ధ్య‌లో హీరోలు ఉన్న‌ట్లు  క‌నిపిస్తుంది.  ఏడాదికి రెండు సినిమాలు చేస్తామ‌ని ప్రామిస్ చేసిన హీరోలు క‌నీసం కొత్త సంవ‌త్స‌రం నుంచైనా అలాంటి ఆలోచ‌న చేస్తే  బాగుంటుంద‌న్న‌ది ప‌లువురి అభిప్రాయం. మ‌రి నానిని   అనుస‌రించే హీరోలు ఎంత మంది ఉంటారో?  చూద్దాం.


Tags:    

Similar News