టాలీవుడ్ లో అతి కొద్ది మంది హీరోలకి మాత్రమే కామెడీ టైమింగ్ ఉంది. ఇది ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. అందులో నాని ఒకడు. తన కామెడీ టైమింగ్ చాలా సినిమాలను గట్టెక్కించాడు నాని. 'అష్టా చమ్మా' నుండి 'కృష్ణ గాడి వీర ప్రేమ గాధ' వరకూ నానికి తన కామెడీ టైమింగ్ బాగా కలిసొచ్చింది. మధ్యలో జెర్సీ లాంటి ఎమోషనల్ కంటెంట్ తో సినిమా చేసి అనుకున్నంత రీచ్ అందుకోలేకపోయాడు నాని.
అయితే అందుకే ఈ సారి మళ్ళీ తనకి కలిసొచ్చిన ఎంటర్టైన్ మెంట్ నే నమ్ముకొని 'గ్యాంగ్ లీడర్' చేసాడు. విక్రం చెప్పిన కథలో కామెడీ ఉంది కాబట్టే నాని ఈ సినిమాకు ఓటేసాడని అర్థమయిపోతుంది. నిజానికి ఇదొక రివెంజ్ స్టోరీ అయినప్పటికీ దానికి కామెడీ యాడ్ సినిమాను తెరకెక్కించాడు విక్రం కుమార్. ఇప్పటికే టీజర్, ట్రైలర్ చూస్తే సినిమాలో కామెడీ డోస్ ఎక్కువే ఉంటుందనేది తెలిసిపోతుంది. సినిమాలో నాని కామెడీ హైలైట్ అంటున్నారు.
నిజానికి ఎంటర్టైన్ మెంట్ ని నమ్ముకున్న ప్రతీ సారి నాని సక్సెస్ అయ్యాడు. 'పిల్ల జమిందార్' - 'భలే భలే మగాడివోయ్' - నేను లోకల్' సినిమాలే దీనికి ఉదాహరణ. కేవలం ఎంటర్టైన్ మెంట్ ని నమ్ముకొని చేసిన 'భలే భలే మగాడివోయ్ అతని కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అందుకే ఇప్పుడు గ్యాంగ్ లీడర్ తో మళ్ళీ ఫుల్లెంత్ గా ఎంటర్టైన్ చేయాలని చూస్తున్నాడు. మరి తన కామెడీతో నాని ఎలా ఎంటర్టైన్ చేస్తాడో చూడాలి.