తన కొత్త సినిమా ‘మజ్ను’ దర్శకుడు విరించి వర్మపై ప్రశంసల జల్లు కురిపించాడు నాని. విరించి వర్మ చాలా నిజాయితీ.. సిన్సియారిటీ ఉన్న దర్శకుడని.. అలాంటి దర్శకుడితో పని చేయడం తన అదృష్టమని నాని చెప్పాడు. విరించి తొలి సినిమా ‘ఉయ్యాల జంపాల’ కథ కూడా తనకు వినిపించి అభిప్రాయం తీసుకున్నాడని.. ‘మజ్ను’ కథ చెప్పగానే మరో మాట లేకుండా అతడికి ఓకే చెప్పేశానని నాని అన్నాడు. ఇంకా విరించి గురించి.. ‘మజ్ను’ గురించి నాని ఏమన్నాడంటే..
‘‘మజ్ను అనే టైటిల్ చూసి మరోలా అనుకోవద్దు. మామూలుగా ప్రేమలో పడి విఫలమైన వాళ్లను చూసి మజ్ను అనేస్తుంటాం. కానీ ఈ సినిమా అలా శాడ్ ఎండింగ్‌తో ఉంటుందేమో అని భయపడవద్దు. ఇది పూర్తి ఎంటర్టైనర్. విరించితో నాకు చాలా కాలం నుంచి పరిచయముంది. ‘ఉయ్యాల జంపాల’ కథను ముందు నాకే చెప్పి ఒపీనియన్ తీసుకున్నాడు. నాకు అతడిలోని నిజాయితీ నచ్చింది. మనం మంచి కథలు వింటాం.. మంచి సినిమాలు చేస్తాం. అలాగే మంచి మనుషుల్ని కలిసినపుడు అసలు వదులుకోకూడదు. విరించి అలాంటి వ్యక్తే. అందుకే అతను మంచి కథ చెప్పగానే డేట్లిచ్చేశాను.
ఐతే అదేంటి విరించికి డేట్లిచ్చేశావా అని కొందరు అడిగారు. విరించి అడిగితే డేట్లేంటి.. పిల్లనైనా ఇచ్చేస్తా అన్నాను. అంత మంచోడు అతను. ‘ఉయ్యాల జంపాల’ను ఎలా అయితే జనాలు ఓన్ చేసుకున్నారో.. అలాగే ‘మజ్ను’ను కూడా చేసుకుంటారు. ఈ సినిమా అంత బాగా ఆడుతుంది. నిర్మాత గీత గారు.. నేను హీరోగా పనికొస్తానా అని నా మీద నాకే సందేహాలున్న రోజుల్లోనే నన్ను నమ్మారు. కిరణ్ గారితో సినిమా చేయాలని ఎప్పట్నుంచో అనుకుంటున్నా. ఇప్పటికి కుదిరింది. మ్యూజిక్ డైరెక్టర్ గోపీసుందర్ నాకు ఆల్రెడీ ‘భలే భలే మగాడివోయ్’ లాంటి మంచి ఆల్బం ఇచ్చారు. ఇది కూడా అలాంటి మంచి ఆల్బమే’’ అని నాని అన్నాడు.