సంక్రాంతి సినిమాలు ఒక్కసారిగా ఉప్పెనలా వచ్చిపడ్డాయి. ఒక్కసారిగా బోలెండంత వినోదంలో తడిసి ముద్దయిపోయిన తెలుగు ప్రేక్షకులు.. ఆ తర్వాత కొంచెం డ్రై పీరియడ్ లో పడ్డారు. తర్వాతి వారం సినిమానే రిలీజ్ కాకపోగా.. ఆపైన రెండు వారాలు బాక్సాఫీస్ ఆశించిన స్థాయిలో కళకళలాడలేదు. జనవరి నెలాఖర్లో వచ్చిన సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు - లచ్చిందేవికి ఓ లెక్కుంది జనాలకు కిక్కివ్వలేదు. ఇక ఈ శుక్రవారం వచ్చిన ‘స్పీడున్నోడు’ కూడా యావరేజ్ టాక్ తో రన్నవుతోంది. ఐతే తర్వాతి వారం రాబోయే నాని సినిమా ‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ’ మీద మాత్రం అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాతో మళ్లీ థియేటర్లు కళకళలాడిపోతాయన్న ఆశతో ఉన్నారు.
ఇప్పటిదాకా ‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ’ విషయంలో ప్రతిదీ పాజిటివ్ గా, క్రియేటివ్ గానే కనిపిస్తూ ఉంది. దీని ప్రమోషన్ కూడా చాలా డిఫరెంటుగా చేస్తున్నారు. ట్విట్టర్ లో వెరైటీ పోస్టర్లతో అదరగొడుతున్నారు. రోజుకో క్రియేటివ్ పోస్టర్ తో జనాల్ని పలకరిస్తూ సినిమా మీద ఆసక్తి పెంచుతున్నారు. తాజాగా వీర ప్రేమికుల కోసం ఓ కాంటెస్ట్ కూడా నడుపుతున్నారు. తమ వీర ప్రేమ గాథల్ని మెయిల్ చేస్తే అందులో బెస్ట్ ఎంపిక చేసి.. వాలెంటైన్స్ డే రోజు ‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ’ యూనిట్ సభ్యులతో కలిసి సినిమా చూసే ఛాన్స్ కల్పిస్తారట. మరోవైపు రోజువారీ కౌంట్ డౌన్ కూడా నడుస్తోంది. ఈ రోజు నాని బైక్ మీద పడుకుని తనదైన శైలిలో రిలీజ్ డేట్ గురించి హింట్ ఇస్తున్న పోస్టర్ సూపరంటే సూపరే. ఇంకో వైపు హైదరాబాద్ సిటీలో ‘కృష్ణగాడు వీర ప్రేమికుడా’ అంటూ రోడ్ల మధ్యలో పెట్టిన ఫ్లెక్సీలు కూడా జనాల్ని బాగా ఆకర్షిస్తున్నాయి.