అఖండ 2' బాలయ్య ఎంట్రీ గురించి..!
ఇప్పటి వరకు వచ్చిన మూడు సినిమాలు భారీ విజయాలను సొంతం చేసుకుంది.;
నందమూరి బాలకృష్ణ 'అఖండ 2' గురించి రోజుకో వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇటీవల హిమాలయాల్లో షూటింగ్ జరుగుతున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెల్సిందే. సినిమాపై అంచనాలు పెంచే విధంగా బాలయ్య అఘోరా గెటప్ గురించి, ఆ పాత్ర గురించి ప్రముఖంగా చర్చ జరుగుతోంది. డాకు మహారాజ్ తర్వాత బాలయ్య నుంచి రాబోతున్న సినిమా కనుక అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా 'అఖండ 2' ఉంటుంది అనే నమ్మకంను మేకర్స్ వ్యక్తం చేస్తున్నారు. బాలయ్య, బోయపాటి కాంబోలో రాబోతున్న నాల్గవ సినిమా ఇది. ఇప్పటి వరకు వచ్చిన మూడు సినిమాలు భారీ విజయాలను సొంతం చేసుకుంది.
అఖండ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. తెలుగు ప్రేక్షకులను మాత్రమే కాకుండా హిందీ ప్రేక్షకులను సైతం ఆకట్టుకున్న అఖండ సినిమాకు సీక్వెల్ అనగానే పాన్ ఇండియా రేంజ్‌లో అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. అంతే కాకుండా సీక్వెల్ కోసం బాలకృష్ణ ను రెండు విభిన్నమైన గెటప్స్‌లో బోయపాటి చూపిస్తున్నట్లుగా వార్తలు వస్తున్న కారణంగా అంచనాలు మరింతగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం హిమాలయాల్లో బాలకృష్ణ ఇంట్రడక్షన్ సన్నివేశాలను రూపొందిస్తున్నట్లు సమాచారం అందుతోంది. అందుకోసం బోయపాటి చాలా స్పెషల్ కెమెరాను వినియోగించడంతో పాటు, సాంకేతికంగా గ్రాండ్‌గా చూపించే ప్రయత్నాలు చేస్తున్నాడట.
సినీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం 'అఖండ 2' సినిమాలో బాలకృష్ణ ఇంట్రడక్షన్ సీన్‌ను అఘోర గెటప్‌తో ఉంటుందట. అంతే కాకుండా శివ లింగంకు అభిషేకం చేస్తున్న అఘోర గెటప్‌లో బాలయ్య ఇంట్రడక్షన్ సీన్ ఉంటుందని, అది అద్భుతంగా ఉంటుంది అంటూ మేకర్స్ చెబుతున్నారు. బోయపాటి ప్రస్తుతం ఈ సీన్‌కి సంబంధించిన షూటింగ్‌లోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఈమధ్య కాలంలో అఘోర సినిమాలు కామన్‌గా వస్తున్నాయి. కానీ అఖండ 2 సినిమాలో ప్రేక్షకులను సర్‌ప్రైజ్ చేసే విజువల్స్ ఉంటాయని మేకర్స్ ఆఫ్ ది రికార్డ్ చెబుతున్నారు. బాలయ్య కెరీర్‌లో బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీగా ఈ సినిమా రూపొందుతుందట.
ఈ సినిమాలో హీరోయిన్‌గా ప్రగ్యా జైస్వాల్ నటిస్తోంది. ముఖ్య పాత్రలో మరో హీరోయిన్ సైతం నటించబోతుంది. ఇప్పటికే కీలక సన్నివేశాలతో పాటు, యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ పూర్తి చేసిన బోయపాటి జూన్ లేదా జులై వరకు షూటింగ్‌ని పూర్తి చేస్తారని తెలుస్తోంది. దసరా సందర్భంగా కచ్చితంగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే విధంగా బోయపాటి ప్లాన్ చేస్తున్నారు. దసరా మిస్ అయితే రెండు మూడు వారాల్లోనే కొత్త రిలీజ్ డేట్‌కి అఖండ 2 వచ్చే అవకాశాలు ఉన్నాయి. కచ్చితంగా 2025లో అఖండ 2 : తాండవం సినిమా రానుందని మేకర్స్ బల్ల గుద్ది మరీ చెబుతున్నారు.