పబ్లిసిటీ సంగతేంటి నానీ?

Update: 2016-02-07 17:30 GMT
ఒక్క సినిమాతో నేచురల్ స్టార్ అయిపోయాడు నాని. స్టాంప్ వేయడం ఏమే కానీ.. భలేభలే మగాడివోయ్ మూవీ నానిని నిజంగానే స్టార్ చేసేసింది. విపరీతమైన స్టార్ డమ్ సంపాదించేసుకున్నాడు. ఆ తర్వాత రెమ్యూనరేషన్ కూడా భారీగా పెంచేశాడనే టాక్ ఉన్నా.. ఇప్పుడు రిలీజ్ కానున్న కృష్ణగాడి వీర ప్రేమగాధ విషయంలో నాని ప్రవర్తన విచిత్రంగానే ఉంది.

సాధారణంగా తన సినిమాలకు తెగ ప్రచారం చేస్తాడు నాని. ఈ విషయంలో ఎగ్రెసివ్ గానే ఉండేవాడు. కొత్త కొత్త ఐడియాలతో ప్రచారానికి ప్రయత్నించేవాడు. భలేమగాడి విషయంలో కూడా ఇలాంటి ఐడియాలు బాగా వర్కవుట్ అయ్యాయి. కానీ ఇప్పుడు కృష్ణగాడి వీర ప్రేమగాధకు.. నాని అసలు కొంచెం కూడా ప్రచారం చేయడం లేదు. అసలిప్పటివరకూ సినిమాకి పాజిటివ్ గా ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఈ నయా స్టార్.

మరో ఐదు రోజుల్లో రిలీజ్ ఉందనగా.. హీరో ఇంత సైలెంట్ గా ఉండడం చాలా మందికి ఆశ్చర్యం కలిగిస్తోంది. ప్రచారం చేయకపోయినా.. తన సినిమాల కోసం జనాలు థియేటర్లకు వచ్చేస్తారని అనుకుంటున్నాడనే కామెంట్స్ వినపడుతున్నాయి. సినిమా కంటే ప్రచారం చాలా ముఖ్యమైన రోజులివి. యావరేజ్ సినిమాని కూడా బ్లాక్ బస్టర్ రేంజ్ కి తీసుకెళ్లడంలో ప్రచారం పాత్ర చాలా ఉంటుంది. ఓ హిట్ వచ్చినంత మాత్రాన మరీ ఇంతాల ఫీల్ అవడం సరికాదనే సూచనలు వినిపిస్తున్నాయి. జాగ్రత్త పడకపోతే.. గతంలో ఎదుర్కున్న మాదిరిగా ఫ్లాప్ లను ఎదుర్కునే పరిస్థితి వస్తుందని హెచ్చరిస్తున్నారు. వింటున్నావా నేచురల్ స్టార్!

Tags:    

Similar News