న్యాచురల్ స్టార్ నాని ఏప్రిల్ 19న విడుదల కాబోతున్న జెర్సీ మీద ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నాడు. గత ఏడాది ఏ మాత్రం అచ్చిరాని నేపధ్యంలో అభిమానులు సైతం గట్టి హిట్టు పడాలని కోరుకుంటున్నారు. కెరీర్లో మొదటిసారి క్రికెటర్ గా నటిస్తున్న నాని ప్రమోషన్ ఈవెంట్స్ లో మీడియాతో ఇంటరాక్ట్ అవుతూ చాలా విశేషాలు పంచుకుంటున్నాడు.
ఇప్పటిదాకా కెరీర్లో చేసిన సినిమాలు అన్నింటిలోకి జెర్సీ ది బెస్ట్ గా నిలుస్తుందని చెబుతూ ఒకటి కాదు రెండు కాదు ఇప్పటిదాకా 20 సార్లు జెర్సీని చూశానని చెప్పడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. హీరో ఎవరైనా సరే తమ సినిమా గురించి గొప్ప చెప్పుకోవడం సహజం. పబ్లిసిటీలో భాగంగా ఓ నాలుగు ముక్కలు ఎక్కువ చెప్పుకోవడం తప్పేమీ కాదు.
కాని ఏకంగా 20 సార్లు చూశాను అని చెప్పడమే కొంత ట్విస్ట్ లా కనిపిస్తోంది. సినిమా బ్రహ్మాండంగా ఉండి బ్లాక్ బస్టర్ హిట్ అయితే నాని మాటకు బలం చేకూరుతుంది. అలా కాకుండా ఏ మాత్రం తేడా వచ్చినా సోషల్ మీడియాలో ట్రాలింగ్ వీరులు బయటికి వచ్చి చెడుగుడు ఆడేస్తారు. అసలు ఇరవై సార్లు చూసింది జెర్సీనేనా లేక పొరబడ్డారా అంటూ కామెడీలు మొదలైపోతాయి.
ఒకవేళ రిలీజయ్యాక హిట్ కొట్టి అప్పుడు నేను ముందే ఇన్నిసార్లు చూశాను సో నా నమ్మకం నిలిచింది అని చెప్పుకోవచ్చు. కాని ఇప్పుడే నాని చెప్పేశాడు కాబట్టి కంటెంట్ మీద మాములు నమ్మకం ఉన్నట్టు కనిపించడం లేదు. గౌతం తిన్ననూరి దర్శకత్వం వహించిన జెర్సీ ద్వారా టాలెంటెడ్ యాక్ట్రెస్ శ్రద్ధా శ్రీనాథ్ హీరొయిన్ గా పరిచయమవుతోంది