టాలీవుడ్ లో ఈ మధ్య మల్టీ స్టారర్ అనే పదానికి అర్థాలు మారిపోతున్నాయి ఇద్దరు హీరోలు కలిసి నటిస్తే చాలు వాళ్ళ మార్కెట్ రేంజ్ తో సంబంధం లేకుండా ఆ ట్యాగ్ పెట్టేసి బిజినెస్ చేసేస్తున్నారు. ఆ పదానికి నిఖార్సైన మీనింగ్ కు ఆర్ఆర్ఆర్ ను తీసుకోవచ్చు. రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ లు ఒకే స్థాయి కాబట్టి ఆ కోణంలో తీసుకోవచ్చు.
ఇక నాని సుధీర్ బాబు కాంబోలో దిల్ రాజు నిర్మాణంలో ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ రూపొందనున్న సంగతి తెలిసిందే. నాని సుధీర్ బాబుల రేంజ్ సమానం కాదు కానీ మల్టీ స్టారర్ గా తీసుకోవచ్చులే అని సర్దుకున్నారు అభిమానులు. అయితే ఇక్కడో ట్విస్ట్ ఉంది. నానిది ఇందులో ఫుల్ లెన్త్ రోల్ కాదట. కేవలం పదిహేను లేదా ఇరవై నిమిషాల పాటు మాత్రమే ఉంటుందట
సో సుధీర్ బాబు మెయిన్ హీరో అన్నమాట . నాని ఫ్లాష్ బ్యాక్ లో వస్తాడో లేక సమాంతరంగా ఉంటుందో క్లారిటీ లేదు కాని అదే పనిగా ఒప్పుకున్నాడు అంటే రోల్ చాలా పవర్ ఫుల్ అయ్యుంటుంది. కథ ప్రకారం ఇదో యాక్షన్ థ్రిల్లర్ అని నాని కథను చాలా కీలక మలుపు తిప్పే పాత్రలో ఎంటర్ అవుతాడని తెలిసింది. అయితే గుర్తుండిపోయే రేంజ్ లో అన్నమాట.
పెదరాయుడులో హీరో మోహన్ బాబే అయినా ఫస్ట్ ఫ్లాష్ అయ్యేది రజనికాంతే. ఆ రేంజ్ లో ఏమైనా డిజైన్ చేశారేమో చూడాలి. సమ్మోహనం తర్వాత ఇంద్రగంటి చేస్తున్న సినిమా ఇదే. అష్టాచెమ్మతో తన కెరీర్ కు బ్రేక్ ఇచ్చిన దర్శకుడిగా ఆయనంటే నానికి ప్రత్యేకమైన గౌరవం. అది కూడా ఈ ప్రాజెక్ట్ ఓకే చేయడానికి కారణం కావొచ్చు. ఇంకొద్ది రోజులు ఆగితే డీటెయిల్స్ తెలుస్తాయి