నిర్మాతగా మారి ‘అ’ సినిమా చేశాక ప్రొడ్యూసర్ల కష్టమేంటో తెలిసిందంటున్నాడు నేచురల్ స్టార్ నాని. ఏదైనా సినిమా వేడుకల్లో నిర్మాతల ప్రసంగాలు దారుణంగా ఉంటాయని.. వాళ్లు పెద్దగా మాట్లాడలేరని.. తక్కువ మాటలతో ముగిస్తుంటారని.. అందుకు కారణమేంటో తనకు ఇప్పుడు తెలిసిందని నాని చెప్పాడు. ‘అ’ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ కోసం రోజంతా పడ్డ టెన్షన్ తర్వాత తనకు నిర్మాతల కష్టం తెలిసిందని నాని చెప్పాడు. అందుకే నిర్మాతలందరికీ సెల్యూట్ చేస్తున్నానని.. వారిపై తనకు ఇప్పటికే ఉన్న గౌరవం మరింత పెరిగిందని నాని చెప్పాడు.
తాను తన జీవితంలో సంపాదించిన ప్రతి రూపాయి సినిమా ద్వారానే వచ్చిందని.. కాబట్టి తన దగ్గరున్న మొత్తం డబ్బుల్ని సినిమా మీదే పెట్టడానికి తాను సిద్ధమని నాని ప్రకటించాడు. ‘అ’ సినిమాలో చేప పాత్రకు వాయిస్ ఓవర్ కోసం దర్శకుడు ప్రశాంత్ వర్మ తన దగ్గరికి వచ్చాడని.. అప్పుడతడి దగ్గర నిర్మాత లేదని.. తానే సెట్ చేస్తానని చెప్పి పంపించానని నాని తెలిపాడు. తనకు తెలిసిన ఇద్దరు ముగ్గురు నిర్మాతలకు ఈ కథ చెప్పి ఒప్పిద్దామని అనుకున్నానని.. కానీ తనకు ధైర్యం సరిపోలేదని.. వాళ్లకు ఈ కథ అర్థమవుతుందో కాదో అనిపించిందని.. ఆ తర్వాత ‘నిన్ను కోరి’ సినిమాలో ‘అడిగా అడిగా’ పాట షూట్ చేస్తున్నపుడు సెట్లో ఒక మూలన ప్రశాంత్ కనిపించాడని.. అతను తన కోసమే ఎదురు చూస్తుండటంతో తాను సరిగ్గా పని చేసుకోలేకపోయానని.. దీంతో షాట్ గ్యాప్ లో అతడి దగ్గరికి వచ్చి ‘నీ సినిమాను నేనే ప్రొడ్యూస్ చేస్తా మిగతా విషయాలు తర్వాత మాట్లాడదాం’ అనేసి వచ్చేశానని.. అన్నట్లే సినిమాను నిర్మించానని నాని చెప్పాడు. తన సినిమాలు వరుసగా హిట్టవుతుండటంతో అప్పుడప్పుడూ కళ్లు నెత్తికెక్కినట్లు అనిపిస్తాయని.. అలాంటపుడు తనకు రాజమౌళి గుర్తుకొస్తాడని.. ఆయన సక్సెస్ మీద నీదెంత అనిపించి మామూలు మనిషిని అవుతుంటానని నాని చమత్కరించడం విశేషం.