టాలీవుడ్ లో కథాకథనాల పరంగా .. పాత్రల పరంగా కొత్తదనానికి ప్రాధాన్యతనిచ్చే యువ కథానాయకుడిగా నాని కనిపిస్తాడు. కథల ఎంపిక విషయంలో చాలామంది ఆయనను ఫాలోకావడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఆయన తాజా చిత్రంగా రూపొందిన 'టక్ జగదీష్'కి శివ నిర్వాణ దర్శకుడిగా వ్యవహరించాడు. 'నిన్నుకోరి' .. 'మజిలీ' వంటి సూపర్ హిట్స్ తరువాత ఆయన చేసిన సినిమా ఇది. భారీ తారాగణంతో నిర్మితమైన ఈ సినిమాను ఏప్రిల్ 23వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో రాజమండ్రిలో .. ఈ సినిమాకి సంబంధించిన 'పరిచయ వేడుక' కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ స్టేజ్ పై హీరో నాని మాట్లాడుతూ .. " ఈ క్రౌడ్ ఏంటి? ఈ సౌండ్ ఏంటి? చాలా కాలం నుంచి మిమ్మల్ని మిస్సయ్యాను. ఈ స్టేజ్ పై మీ అందరినీ కలుసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. రాజమండ్రిలో ఫంక్షన్ అనుకున్నప్పుడు 'వస్తున్నా రాజమండ్రికి' అని ఒక పోస్ట్ పెట్టాను. కానీ నిజానికి వారం రోజుల నుంచి నేను రాజమండ్రిలో 'శ్యామ్ సింగ రాయ్' షూటింగులో ఉన్నాను. ఈ ప్రోగ్రామ్ కి 'పరిచయ వేడుక' అనే పేరు పెట్టడానికి కారణం ఏమిటంటే, చాలా బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఏమోషన్స్ ఉన్న సినిమా ఇది. సినిమాలోని నా ఫ్యామిలీని మీ అందరికీ పరిచయం చేయాలనుకుంటున్నాను. సినిమాలోని మా ఫ్యామిలీ సభ్యులను ఒక్కొక్కరిగా స్క్రీన్ పై చూపిస్తే వాళ్లు ఎవరు .. ఏమిటనేది చెబుతాను.
ఆదిశేషనాయుడు (నాజర్) మా నాన్నగారు. ఊరికి పెద్ద .. జగదీష్ కి ఆయన ఎంత చెబితే అంత. మా అమ్మ అర్జునమ్మ .. మా అందరినీ ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉంటుంది. తల్లి అంటే జగదీశ్ కి ప్రాణం. మా అన్నయ్య బోస్ (జగపతి బాబు) మా నాన్నకు రైట్ హ్యాండ్ లా ఉంటాడు. దేవుడు బావ (రావు రమేశ్) అంటే జగదీశ్ కి చాలా ఇష్టం .. ఆయనతోనే అన్నివిషయాలు షేర్ చేసుకుంటాడు. ఇక సత్తిబాబు మా చిన్నబావ (నరేశ్) సరదా మనిషి. కుమారక్కగా రోహిణి .. గంగక్కగా దేవదర్శిని కనిపిస్తారు. నా మేనకోడలు చంద్ర (ఐశ్వర్య రాజేశ్) అంటే నాకు ప్రాణం .. ఇదీ మా కుటుంబం.
ఇక నేను ఫ్యాన్స్ ను పెద్దగా పట్టించుకోనని చాలామంది అనుకుంటూ ఉంటారు. నిజంగానే నేను వాళ్లని ప్రోత్సహించను. మిగతావాళ్ల మాదిరిగా ఫ్యాన్స్ అల్లరి చేయాలనీ .. వేరే వాళ్లతో గొడవలు పడాలని .. కటౌట్లు పెట్టేసి పాలాభిషేకాలు చేయాలని నేను కోరుకోను. మీరంతా నన్ను చూసి గర్వపడేలా నడుచుకోవాలని కోరుకుంటున్నాను. అందుకోసం ప్రతిరోజూ కష్టపడుతూనే ఉంటానని ప్రామిస్ చేస్తున్నాను" అని చెప్పుకొచ్చాడు.