``అవును.. అసలు చొక్కా తొడగడమే అసౌకర్యం అనుకుంటే 80 రోజులు టక్ తీయలేదు! చివరికి టక్ చేయడం అనే కళ నేర్చుకున్నాక సుఖపడ్డాను!! అని అంటున్నారు నేచురల్ స్టార్ నాని. ఆయన కథానాయకుడిగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన `టక్ జగదీష్` ఏప్రిల్ 23 న థియేటర్లలో విడుదలవుతోంది. ప్రస్తుతం దర్శకహీరోలు ప్రచారంలో వేడి పెంచేస్తున్నారు. తాజాగా ఓ ఇంటరాక్షన్ లో నాని మాట్లాడుతూ టక్ గురించి పైవిధంగా స్పందించారు.
అసలు అంత సేపు చొక్కా తొడగడమే సుఖంగా ఉండదు అనుకుంటే 70-80 రోజుల షూటింగ్ కోసం టక్ చేసుకుని సెట్స్ లో ఉండాల్సొచ్చిందని.. సినిమా అంతా టక్ తో కనిపిస్తానని నాని తెలిపారు. సాధారణంగా చొక్కా వేసుకోవడం సుఖంగా ఉండదని ఆ కళను అలవాటు పడ్డాక సుఖంగా ఉందని నాని అనడం ఆసక్తికరం.
ఇప్పటికే సినిమా ఫైనల్ కట్ చూశాను. చాలా ఆనందంగా ఉంది. నాకు పూర్తి సంతృప్తినిచ్చిన చిత్రమిది. బ్లాక్ బస్టర్ కొడతామని నేను శివ మోక్షానికి చెప్పాను. ట్రైలర్ ఏప్రిల్ 13 న ఉగాది రోజు వైజాగ్ లో విడుదల చేస్తాం`` అని తెలిపారు. అలాగే అభిమానుల గురించి ప్రస్థావించిన నానీ.. పాలాభిషేకాలు పూజలకు అనుమతించనని.. తానే తన కుటుంబంగా భావించే అభిమానుల కోసం ఏదైనా చేస్తానని అన్నారు. అనవసర హంగామాకు ఎంకరేజ్ చేయనని మరోసారి క్లారిటీనిచ్చారు. అభిమానులు నా గురించి గర్వపడేలా చేయడానికి నేను ఎప్పుడూ ప్రయత్నిస్తానని నాని అన్నారు.