పెళ్ళిచూపులు.. ఫిదా.. అర్జున్ రెడ్డి.. ఆమితూమి.. ఈ సినిమాలన్ని ఈ మధ్యకాలంలో చిన్న సినిమాలుగా వచ్చేసి బడా సక్సెస్ లు కొట్టేశాయి. అయితే ఈ సినిమాల్లో ముఖ్యంగా చెప్పుకోదగినది ఏంటంటే.. వాటిలోని హీరోలూ హీరోయిన్లూ మాట్లాడిన భాషే. ఎక్కువగా గోదావరి స్లాంగ్ వినడానికి అలవాటుపడిన తెలుగు ప్రజలకు.. ఒక్కసారి తెలంగాణ స్లాంగ్ రుచి చూపించారు. అది అన్నిచోట్లా జనలకు బాగా నచ్చేయడంతో.. సినిమాలు పెద్ద హిట్టే అయ్యాయ్. అందుకే ఇప్పుడు నాని కూడా అదే రూటులో వెళ్తున్నాడట.
ఇప్పటివరకు చాలా సినిమాల్లో భీమవరం (మజ్నూ) అబ్బాయిగా.. తిరుపతి (కృష్ణగాడి వీర ప్రేమగాద) అబ్బాయిగా కనిపించిన నాని.. ఇప్పుడు తను కూడా హిట్టు స్లాంగ్ లో ఆడిపాడాలని ఆశిస్తున్నాడు. అందుకే త్వరలో రానున్న ఒక సినిమాలో మనోడు కూడా పూర్తి స్థాయి తెలంగాణ బాషనే ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ ఏ సినిమాలో అనుకుంటున్నారు? ఆల్రెడీ చాలావరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ''ఎం.సి.ఏ'' సినిమా ఉంది చూశారు.. ఇందులో మన మిడిల్ క్లాస్ అబ్బాయి పూర్తి తరహాలో తెలంగాణ స్లాంగ్ తెలుగు మాట్లాడతాడట. పైగా సినిమా బ్యాక్ డ్రాప్ కూడా వరంగల్.. అలాగే హన్మకొండ నేపథ్యంతో సాగుతుందట.
మొత్తానికి ఏదన్నా ఒక్క ప్రయత్నం హిట్టయ్యిందంటే చాలు.. మనోళ్ళు అందరూ ఇక అదే పనిని తెగ చేస్తుంటారు. అందుకు న్యాచురల్ స్టార్ కూడా అతీతం కాదన్నామట. అప్పుడెప్పుడో 'ఓ మై ఫ్రెండ్' సినిమాను తీసిన వేణు శ్రీ రామ్.. ఇప్పుడు దిల్ రాజు కాంపౌండ్లో తన రెండో సినిమాగా.. ఇలా నాని అండ్ సాయి పల్లవిని ఎంసిఏ చదివిస్తున్నాడు. అది సంగతి.