తెలుగులో మాంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో జూనియర్ ఎన్టీఆర్ ఒకడు. కెరీర్ ఆరంభంలోనే ఇండస్ట్రీ రికార్డుల్ని తిరగరాసి భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడీ నందమూరి హీరో. ఐతే మధ్యలో వరుస ఫ్లాపుల కారణంగా రేసులో వెనుబడిపోవడంతో అభిమానుల్లో కూడా ఉత్సాహం తగ్గిపోయింది. కానీ ‘టెంపర్’తో మళ్లీ ఫ్యాన్స్ లో ఉత్సాహం తీసుకొచ్చాడు యంగ్ టైగర్. ఇప్పుడు ‘నాన్నకు ప్రేమతో’ సినిమాతో ఆ ఉత్సాహం రెట్టింపవుతోంది. సుకుమార్ లాంటి క్లాస్, స్టార్ డైరెక్టర్ తో ఎన్టీఆర్ జత కట్టడం.. ‘నాన్నకు ప్రేమతో’కు సంబంధించిన ప్రోమోస్, ట్రైలర్ అన్నీ కూడా ఆసక్తి రేపడంతో మాంచి హైప్ మధ్య విడుదలవుతోందీ సినిమా.
ఈ నేపథ్యంలో అభిమానుల సందడి మామూలుగా లేదు. నాన్నకు ప్రేమతో సినమిా కోసం ఎన్టీఆర్ వేసిన కొత్త గెటప్ తో మాస్కులు తయారు చేసుకుంటున్నారు. ఎన్టీఆర్ 25వ సినిమా, నాన్నకు ప్రేమతో అన్న ముద్రలతో స్పెషల్ టీషర్టులు రెడీ చేస్తున్నారు. ఇంకా అమ్మాయిలైతే హెన్నాతో ఎన్టీఆర్ పేరును చేతులపై ముద్రలు వేయించుకుంటున్నారు. ఇంకా నాన్నకు ప్రేమతో టీ కప్పులు కూడా తయారవుతున్నాయి. సంక్రాంతి ముగ్గుల్లోనూ ఈ సినిమా ఫ్లేవర్ కనిపిస్తోంది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో.. ఓవర్సీస్ లో ‘నాన్నకు ప్రేమతో’ బెనిఫిట్ షోలకు కూడా అభిమానులు ఉత్సాహంగా తయారవుతున్నారు. ఎంత రేటైనా పెట్టి టికెట్లను కొనుక్కోవడానికి రెడీ అవుతున్నారు. మొత్తంగా సంక్రాంతికి రాబోయే తొలి సినిమా విషయంలో అభిమానుల్లో హైప్ మామూలుగా లేదు.