ప్రేమతో కోట్లు పట్టేస్తున్నాడు

Update: 2016-01-18 17:30 GMT
యంగ్ టైగర్ లేటెస్ట్ మూవీ రికార్డులు కంటిన్యూ అవుతున్నాయి. కాంపిటీషన్ కారణంగా రిజల్ట్ మీద ఎన్నో అనుమానాల మధ్య రిలీజ్ అయిన నాన్నకు ప్రేమతో.. లోకల్ గానే కాదు ఓవర్సీస్ లోనూ ప్రభంజనం సృష్టిస్తోంది. సాధారణంగా ఎన్టీఆర్ సినిమాలు సీడెడ్ లో కలెక్షన్స్ వరద పారిస్తాయి. కానీ ఈ సారి ఇదే రేంజ్ లో ఓవర్సీస్ లోనూ వసూళ్లు రావడం విశేషం.

సుకుమార్ సృష్టించిన ఇంటెలిజెంట్ గేమ్ ప్లేకి అన్ని వర్గాల నుంచి ఆదరణ లభిస్తోంది. టాక్ యావరేజ్ గా ఉన్నా, కలెక్షన్స్ మాత్రం బ్లాక్ బస్టర్ మూవీ స్థాయిలో వస్తున్నాయి. మంగళవారం రిలీజ్ కావడం ఈ మూవీకి చాలా ప్లస్ అయింది. వీకెండ్స్ వరకూ దాదాపు ఆరు రోజుల పాటు స్టడీగా కలెక్షన్స్ నిలబడ్డం గ్రేట్ అనాల్సిందే. శుక్రవారం నాడు యూఎస్ లో 263,983 డాలర్లు వసూలవగా, శనివారానికి 375,184 డాలర్లు వచ్చాయి. వీటితో కలిపి మొత్తం ఇప్పటికి ఐదు రోజుల్లో 1.635 మిలియన్ డాలర్లను గ్రాస్ రూపంలో వసూలు చేసింది నాన్నకు ప్రేమతో.

ఎన్టీఆర్ - రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన ఈ మూవీ.. ఇప్పుడు ఆల్ టైం ఓవర్సీస్ టాప్ ఫైవ్ లిస్ట్ లోకి చేరిపోయింది. 6.9మిలియన్ డాలర్లతో బాహుబలి మొదటి స్థానంలో ఉండగా, శ్రీమంతుడు 2.89మిలియన్ డాలర్లు, అత్తారింటికి దారేది 1.896 మిలియన్ డాలర్లు - సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు 1.638డాలర్లతో తరువాతి స్థానాల్లో ఉన్నాయి. ఆదివారం నాటికే నాలుగో స్థానానికి చేరుకోనున్న నాన్నకు ప్రేమతో.. సెకండ్ ప్లేస్ వరకూ పోటీ ఇచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
Tags:    

Similar News