యంగ్ టైగర్ ఎన్టీఆర్ సంచలనాలకు సెంట్రాఫ్ ఎట్రాక్షన్ అయిపోతున్నాడు. నాన్నకు ప్రేమతో చిత్రంతో రికార్డులను బద్దలు కొట్టేస్తున్నాడు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో అభిమానులతోపాటు, అందరినీ ఆకట్టుకుంటున్న ఈ మూవీ.. ఓవర్సీస్ లో కూడా రికార్డులకు తెర తీసింది.
ప్రీమియర్ షోల ద్వారా 73 సెంటర్ల నుంచి 3,46,056 డాలర్లను వసూలు చేసింది నాన్నకు ప్రేమతో. ఇక మొదటి రోజున 2,20,000 డాలర్లు వసూలయయ్యాయి. అంటే.. మొదటి రోజుకే హాఫ్ మిలియన్ మార్కును.. ఎన్టీఆర్ క్రాస్ చేసేశాడన్న మాట. ఇంకా వీకెండ్ స్టార్ట్ కూడా అవకపోవడం, వీకెండ్స్ మరింతగా స్క్రీన్ల సంఖ్య పెరిగే అవకాశాలు ఉండడంతో.. అమెరికా బాక్సాఫీస్ లో నాన్నకు ప్రేమతో టాప్ ఛార్టుల్లోకి దూసుకెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. కంప్లీట్ క్లాస్ సినిమా కావడం. మధ్య మధ్యలో మాస్ ఎలిమెంట్స్ ని జాగ్రత్తగా మిక్స్ చేయడం.. ఈ మూవీకి కలిసొచ్చిన విషయంగా చెప్పాలి.
ఎన్టీఆర్ పవర్ ఫుల్ యాక్షన్ కి తోడు... క్లాస్ మూవీస్ విషయంలో డైరెక్టర్ సుకుమార్ కి ఉన్న క్రేజ్.. ఈ భారీ వసూళ్లకు కారణంగా చెప్పచ్చు. హాలీవుడ్ రేంజ్ మేకింగ్ ఎన్నారై ప్రేక్షకులను బాగా ఆకట్టకుంటోంది. ఇదే స్పీడ్ వీకెండ్స్ వరకు ఉంటే.. ఖచ్చితంగా 2మిలియన్ డాలర్ల వసూళ్లను సాధిస్తుంటున్నారు ట్రేడ్ పండిట్స్. ఎన్టీఆర్ కెరీర్లో నాన్నకు ప్రేమతో బిగ్గెస్ట్ మూవీగా నిలవడం ఖాయంగా కనిపిస్తోంది.