ట్రైలర్ టాక్: అక్కడ ట్రంపు.. ఇక్కడ కార్తికు

Update: 2018-09-10 13:35 GMT
సుధీర్ బాబు - నభా నటేష్ హీరో హీరోయిన్లు గా RS నాయుడు దర్శకత్వంలో తెరకెక్కిన 'నన్ను దోచుకుందువటే' ట్రైలర్ ఈరోజే రిలీజ్ అయింది.  రెండు నిముషాల పదహారు సెకన్ల ట్రైలర్ లో స్టార్ట్ నుండి ఎండ్ వరకూ కామెడీ పంచ్ లు అదిరిపోయాయి.  పని రాక్షసుడిగా స్ట్రిక్ట్ గా ఉన్న బాస్ గా కార్తిక్ (సుధీర్ బాబు) అందరినీ జడుసుకునేలా చేస్తుంటాడు.  ఇక సగం ట్రైలర్ ఆఫీస్ లో పనిచేసేవాళ్ళ బాధలే.

శాంపిల్ డైలాగ్స్ చూడండి.. " ఆఫీసుకు రావాలంటే ప్రతిరోజూ భయంతో చచ్చిపోతున్నాం సార్ అక్కడ అమెరికాలో ట్రంపు.. ఇక్కడ కార్తికు" అని ఆఫీస్ లో ఒకరంటే..  "కార్తీక్ నా పెర్ఫార్మన్స్ బాగాలేదన్నప్పుడల్లా నాకు నా వైఫ్ గుర్తొస్తోంది సార్!!" అంటూ మరొక ఉద్యోగి తన గోడు చెప్పుకుంటాడు.  ఇక కమెడియన్ సుదర్శన్ కు అప్రైజల్ లో "లాస్ట్ త్రీ మంత్స్ నీ పెర్ఫార్మన్స్ ఇది" అంటూ రిపోర్ట్ చూపిస్తే "జాబుంటేనే పిల్లనేవ్వడూ ఇవ్వటం లేదు కార్తీక్"  అంటూ తన బాధ చెప్పుకోవడానికి ట్రై చేస్తాడు. దీంతో "ఎపాయింట్మెంట్ లెటర్ లో పెళ్లి చేస్తామని కంపెనీ నీకేమైనా కమిట్మెంట్ ఇచ్చిందా?" అంటూ స్ట్రాంగ్ డోస్ ఇస్తాడు.

ఒక హీరోయిన్ నభా నటేష్ తనను తానూ ఇలా పరిచయం చేసుకుంటుంది "సిరి సాఫ్ట్ వేర్ ఇంజనీర్.  చేసింది 8 షార్ట్ ఫిలిమ్స్.. 3 బ్లాక్ బస్టర్స్ 3 సూపర్ హిట్స్ 3  యావరేజేస్. ఫేస్ బుక్ లో 2 లక్షల లైకులు. ఇన్స్టా లో 5 వేల ఫాలోయర్స్.  ఇది నా ట్రాక్ రికార్డ్." ఇక ఆఫీసులో అందరూ కలిసి వైవా హర్ష దర్శకత్వంలో 'బిస్కెట్' అనే షార్ట్ ఫిలిం మొదలు పెడతారు.  అందులో సుధీర్ బాబు - నభ నటేష్ లీడ్ యాక్టర్స్.  సుధీర్ బాబు కు అస్సలు యాక్టింగ్ రాదు. "వైవా హర్ష విసిగిపోయి "ఒక సీనుకు ౩౩ టేకులు.  ఉన్న నవరసాలలో ఏ ఒక్క రసాన్ని కూడా సరిగా దగ్గరకు రానివ్వకుండా చేస్తున్నాడా మనిషి" అంటాడు. 'బిస్కెట్' షార్ట్ ఫిలిం కామెడీ సంగతి పక్కన పెడితే హీరో - హీరోయిన్లు లవ్ లో పడతారు.  కానీ మధ్యలో కెరీర్ కు ఇబ్బంది రావడంతో.. హీరోయిన్ ను దూరం పెడతాడు. ఇక ఫైనల్ గా ఏం జరిగింది అన్నది స్టోరీ.

జస్ట్ జోకులే కాకుండా "అమ్మాయిలకు అమెరికా మీద ఇష్టం ఉండొచ్చేమో గానీ అమెరికా వెళ్ళే ప్రతోడి మీద ఇష్టం ఉండదు బావా" లాంటి మీనింగ్ ఫుల్ డైలాగులు కూడా ఉన్నాయి. "ఇంతే ఇంతేనా ప్రేమంటే ఇంతేనా" పాట బాగుంది. అజనీష్ లోకనాథ్ మ్యూజిక్.. సురేష్ రగుతూ సినిమాటోగ్రఫీ రెండూ మంచి ఫీల్ ఇచ్చేలా ఉనాయి.  ఓవరాల్ గా 'నన్ను దోచుకుందువటే' ట్రైలర్ ఒక మంచి ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ ను చూడబోతున్నమనే ఫీలింగ్ కలిగించింది.  ఇక మీరు ఓ లుక్కేయండి.

వీడియో కోసం క్లిక్ చేయండి

Full View

Tags:    

Similar News