బాలా మావయ్య నటన నభూతో నభవిష్యతి!

Update: 2019-02-17 16:00 GMT
ఈ సోషల్ మీడియా యుగంలో ఏ అంశం మీదైనా సెలబ్రిటీలు స్పందించాలంటే చాలా జాగ్రత్తగా అవసరం. స్పందనలు కొంచెం అటూ ఇటూ అయితే నెటిజనులు ఒక్క క్షణం ఆగకుండా తలంటేయడం మొదలు పెడతారు.  ఈ విషయంలో ఏం తేడాలు పాటించరు.. రిజర్వేషన్లు అంతకన్నా ఇవ్వరు.  తాజాగా ఇలాంటి అనుభవం నారా లోకేష్ బాబుకు ఎదురైంది.

రీసెంట్ గా 'ఎన్టీఆర్ మహానాయకుడు' ట్రైలర్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.  ఈ ట్రైలర్ పై స్పందించిన లోకేష్ బాబు తన ట్విట్టర్ ఖాతా ద్వారా "వెండితెర ఇలవేల్పు, తెలుగువారి ఆరాధ్య నాయకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావుగారి బయోపిక్ లో రెండవ భాగం 'మహానాయకుడు' చిత్ర ట్రైలర్ అత్యద్భుతంగా, ఆసక్తిని రేకెత్తిస్తోంది. మహానాయకుడుగా బాలా మావయ్య నటన నభూతో నభవిష్యతి" అంటూ ట్వీట్ చేశారు.  అంతే.. ఇంకేమీ చేయలేదు..!

దానికి నెటిజనుల స్పందనలు ఇలా ఉన్నాయి. కింద ఉన్నవి చినబాబు ట్వీట్ కింద ఉండే రిప్లైలు. (నోట్: స్పెలింగ్ మిస్టేక్స్ కూడా సరి చేయలేదు.. ట్విట్టర్ లో ఉన్నట్టే ఇవ్వ్వడం జరిగింది)

- ఆసక్తి రేకెత్తిస్తున్నది ఈ ట్రైలర్ కాదు సినబాబూ! మీ అయ్య పేరు జెప్పి, పళ్ళు పట.. పట.. పటా.. కొరుకుతాడే... ఆ "లక్ష్మి'స్ ఎన్ఠీఆర్" ట్రైలర్!

- అటువంటి నాయకుడికి మీరేఁదుకు వేన్నుపోటు పోడిచారు

- సర్.. లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ చూడండి. అదింకా సూపర్ గా ఉంది.

- ఇలా సెల్ఫ్ డబ్బాలు కొట్టే.. ఫస్ట్ పార్ట్ ని ముంచారు... కొంచెం ఓపిక పట్టండి సామి...

- మీ తాత అసలు బయోపిక్ 'రామ్ గోపాల్ వర్మ' చూపిస్తాడు తేలుగు ప్రజలకు వేచి ఉండు లోకేష్

-  ఎన్టీఆర్ గారి గురించి వెన్నుపోటు దారులు ఆయనపై చెప్పులు విసిరించిన మిరే చెప్పాలి

అలా అని అందరూ లోకేష్ ను విమర్శించలేదు. కొందరు మద్దతుగా కూడా రిప్లైలు ఇచ్చారు లెండి. మేము చాలా ఆసక్తిగా ఉన్నామని ఒకరు.. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన ఎన్టీఆర్ రాజకీయ పయనాన్ని చూడాలని ఉందని మరొకరు.. ఫస్ట్ పార్ట్ కంటే సెకండ్ పార్ట్ బెటర్ గా ఉంటుందని భావిస్తున్నానని ఇంకొకరు లోకేష్ కు మద్దతు ఇచ్చారు.
    

Tags:    

Similar News