‘బాలకృష్ణుడు’ మూవీ రివ్యూ
నటీనటులు: నారా రోహిత్-రెజీనా కసాండ్రా-రమ్యకృష్ణ-అజయ్-పృథ్వీ-వెన్నెల కిషోర్-శ్రీనివాసరెడ్డి-రవివర్మ తదితరులు
సంగీతం: మణిశర్మ
ఛాయాగ్రహణం: విజయ్.సి.కుమార్
కథ, మాటలు: రాజా కొలుసు
నిర్మాతలు: మహేంద్ర బాబు-ముసునూరు వంశీ-శ్రీ వినోద్ నందమూరి
స్క్రీన్ ప్లే-దర్శకత్వం: పవన్ మల్లెల
కెరీర్ ఆరంభం నుంచి వైవిధ్యమైన సినిమాలతో ప్రయాణం చేస్తున్న కథానాయకుడు నారా రోహిత్. అతను తొలిసారి పక్కా కమర్షియల్ కథలో నటించిన సినిమా ‘బాలకృష్ణుడు’. పవన్ మల్లెల అనే కొత్త దర్శకుడు రూపొందించిన ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి రోహిత్ తొడుక్కున్న కమర్షియల్ చొక్కా అతడికి ఏమాత్రం సెట్టయిందో.. ఈ సినిమా ప్రేక్షకులకు ఏమాత్రం వినోదం పంచిందో చూద్దాం పదండి.
కథ: బాలు (నారా రోహిత్) డబ్బు కోసం ఏ పనైనా చేసే కుర్రాడు. అతడికి ఓ ఫ్యాక్షన్ కుటుంబానికి చెందిన ఆధ్య (రెజీనా) అనే అమ్మాయిని కాపాడే బాధ్యత అప్పగిస్తారు. హైదరాబాద్ లో ఆమె కోసం తిరుగుతున్న ప్ర్తత్యర్థుల నుంచి కాపాడి.. రాయలసీమకు తీసుకెళ్తున్న క్రమంలో.. ఆధ్య కుటుంబానికి బద్ధ శత్రువైన ఫ్యాక్షనిస్టు ప్రతాపరెడ్డి (అజయ్) ఎదురవుతాడు బాలుకు. ప్రతాపరెడ్డిని అతడి శత్రువులకు పట్టించేందుకు బాలు ప్రయత్నించగా.. అది బెడిసికొడుతుంది. దీంతో అతను ఆధ్యతో పాటు బాలును కూడా చంపాలన్న కసితో రగిలిపోతుంటాడు. మరి అతడి నుంచి తనను తాను బాలు ఎలా కాపాడుకుని.. ఆధ్యను రక్షించాడన్నది మిగతా కథ.
కథనం-విశ్లేషణ: ‘బాలకృష్ణుడు’ సినిమా మొదలైనప్పటి నుంచి ప్రేక్షకులకు ఒకటే సందేహం వెంటాడుతూ ఉంటుంది..? తొలి సినిమాకే ఒక సాహసోపేతమైన.. వైవిధ్యమైన కథను ఎంచుకుని.. ఆ తర్వాత కూడా ఆ తరహా కథలతోనే ప్రయాణం చేస్తున్న నారా రోహిత్.. ఈ కథను ఎలా ఓకే చేశాడు అని. రోహిత్ కమర్షియల్ కథతో సినిమా చేయొద్దని కాదు. కానీ అలా చేసేటపుడు కొంచెం కంటెంపరరీగా అనిపించే కథను ఎంచుకోవాల్సింది. ఎప్పుడూ వైవిధ్యమైన సినిమాలు చేస్తూ ఒక రొటీన్ కథలో నటించడం అతడికి కొత్తగా అనిపించిందేమో కానీ.. కొన్నేళ్ల కిందటే ఔట్ డేట్ అయిపోయిన ఫార్ములా కథలో రోహిత్ ను చూడటం మాత్రం కథలో ఎంపికలో అతడి అభిరుచిని మెచ్చి.. అభిమానించే వారిని నిరాశ పరుస్తుంది.
‘బాలకృష్ణుడు’ ఓ పదేళ్ల కిందట వస్తే ప్రేక్షకులకు నచ్చేదేమో. ఎందుకంటే రెండు ఫ్యాక్షన్ ఫ్యామిలీల మధ్య ఓ అమ్మాయి చిక్కుకుని ఇబ్బంది పడుతుంటే.. హీరో వచ్చి ఆమెను రక్షించి.. ఆమెతో ప్రేమలో పడి.. ఆమె కూడా తనను ప్రేమించేలా చేసి.. ఓ కమెడియన్ని బకరాలా వాడుకుని.. తన తెలివి తేటలతో అందరి ఆట కట్టించి.. కథను సుఖాంతం చేసే కథలకు అప్పుడే మంచి గిరాకీ ఉండేది. ఐతే ‘రెడీ’తో మొదలైన ఈ ఫార్ములాను తర్వాతి కొన్నేళ్లలో పీల్చి పిప్చి చేసేశారు. దీంతో ఈ కోవలో ఆ తర్వాత వచ్చిన సినిమాలన్నీ బోల్తా కొట్టేయడం.. ఆ ఫార్ములా అటకెక్కేయడం జరిగింది.
ఐతే కొత్త దర్శకుడు పవన్ మల్లెల మళ్లీ అదే ఫార్ములాతో ‘బాలకృష్ణుడు’ తీశాడు. ఇలాంటి కథలో నారా రోహిత్ ను చూడటం మాత్రమే ఇందులో కొత్తదనం. సన్నబడ్డ నేపథ్యంలో అతడి లుక్ కూడా కొత్తగా అనిపిస్తుంది. ఐతే ఈ సినిమాలోని బాలు పాత్ర రోహిత్ క్యాజువల్ అప్రోచ్ అంతగా సూటవ్వలేదు. ఒక ఫార్మాట్లో సాగిపోయే ఈ కథలో కామెడీ కొంతమేర వర్కువటైంది. ఎప్పుడూ బ్రహ్మానందం చేసే పాత్రలో పృథ్వీ కనిపించాడు. అతను ఓ మోస్తరుగా నవ్వించాడు. ఇక మాస్ ప్రేక్షకులు ఆశించే ఫైట్లు.. పాటలు.. ట్విస్టులకు ఒక లెక్క ప్రకారం చోటిచ్చారు.
నిజానికి ‘బాలకృష్ణుడు’ గురించి చెబుతూ తొలిసారి కమర్షియల్ సినిమా చేశానని.. ఇది కొత్త కథేమీ కాదని నారా రోహిత్ ముందే ప్రేక్షకుల్ని ప్రిపేర్ చేసే ప్రయత్నం చేశాడు. ఐతే ‘రెడీ’ ఫార్ములా ఔట్ డేట్ అయిపోయాక కూడా కొన్నేళ్ల కిందట అదే ఫార్ములాలో వచ్చిన ‘లౌక్యం’ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. కథ పాతదైనా వినోదంతో మాయ చేయగలిగితే ప్రేక్షకులు మన్నిస్తారు. కానీ అలా ప్రేక్షకుల్ని మాయ చేసే స్థాయిలో ఇందులో ఎంటర్టైన్మెంట్ పండలేదు. కమర్షియల్ మీటర్ పక్కాగా ఫాలో అయినప్పటికీ.. ఆ ఆకర్షణలు అంతగా ఎంగేజ్ చేయలేదు.
ఎమోషనల్ గా కనెక్టయ్యే పాయింటేమీ ఇందులో లేకపోవడం మైనస్ అయింది. హీరోయిన్ కష్టాన్ని ముందు ప్రేక్షకులు ఫీలయ్యేలా చేయడంలో దర్శకుడు విఫలమయ్యాడు. హీరో-హీరోయిన్ మధ్య లవ్ స్టోరీని కూడా తేల్చేశారు. సరైన లవ్ సీన్ ఒక్కటీ లేదు ఇందులో. సన్నివేశాలు ఒకదాని తర్వాత ఒకటి అలా వచ్చి వెళ్తుంటాయి కానీ.. ఒకదానికి ఇంకోదానికి లింక్ ఉండదు. ప్రథమార్ధంలో అక్కడక్కడా కొన్ని చెప్పుకోదగ్గ మూమెంట్స్ అయినా ఉన్నాయి కానీ.. సెకండాఫ్ పూర్తి తేలిపోయింది. ఒక దశ దాటాక ‘బాలకృష్ణుడు’ బాగా బోర్ కొట్టించేస్తుంది. ముగింపు కూడా చాలా మామూలుగా అనిపిస్తుంది. స్థూలంగా చెప్పాలంటే ‘బాలకృష్ణుడు’ నారా రోహిత్ నుంచి ఆశించని రొటీన్ కమర్షియల్ మూవీ.
నటీనటులు: నారా రోహిత్ ఎప్పుడూ భిన్నమైన.. కొంచెం క్లిష్టమైన పాత్రలే చేస్తూ వచ్చాడు కాబట్టి ‘బాలకృష్ణుడు’లోని పాత్ర మామూలుగా అనిపిస్తుంది. ఆ పాత్రను సింపుల్ గా చేసుకెళ్లిపోయాడతను. రోహిత్ లుక్ బాగుంది. రెజీనాది మామూలు పాత్రే. ఆమె గ్లామరస్ గా కనిపించింది. లీడ్ విలన్ పాత్రలో అజయ్ పర్వాలేదు. రమ్యకృష్ణ స్థాయికి తగ్గ పాత్ర కాదు ఇది. శివగామిగా ఆమెను చూసిన కళ్లతో ఈ పాత్రలో చూస్తే నిరాశ తప్పదు. పృథ్వీ.. వెన్నెల కిషోర్ అక్కడక్కడా నవ్వించారు. రవివర్మ ఓకే.
సాంకేతికవర్గం: మణిశర్మ చాన్నాళ్ల తర్వాత ఒక కమర్షియల్ సినిమాకు మ్యూజిక్ చేశాడు. నేపథ్య సంగీతం ఈ తరహా సినిమాలకు సరిపోయేలా ఇచ్చాడు మణిశర్మ. పాటలు ఏమంత ఆకట్టుకోవు. విజయ్.సి.కుమార్ ఛాయాగ్రహణం కూడా మామూలే. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్లుగా ఉన్నాయి. రాజా అందించిన కథలో ఏ విశేషం లేదు. డెబ్యూ డైరెక్టర్ పవన్ మల్లెల కూడా దర్శకుడిగా తన ప్రత్యేకత ఏమీ చాటుకున్నది లేదు. స్క్రీన్ ప్లే రొటీన్ అనిపిస్తుంది. అక్కడక్కడా కొంచెం కామెడీ వరకు బాగానే డీల్ చేశాడు. అంతకుమించి అతను చేసిందేమీ లేదు.
చివరగా: బాలకృష్ణుడు.. బోర్ కొట్టిస్తాడు
రేటింగ్ - 1.75/5
Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre