హీరోలు కొత్త కొత్త సినిమాలు చేయాలంటే చాలా టైం పడుతుందంటారు. కానీ నారా రోహిత్ వైవిధ్యమైన సినిమాలు చేస్తూనే యమ స్పీడు చూపిస్తుంటాడు. జయాపజయాలతో సంబంధం లేకుండా సరికొత్త కథాంశాలతో లో బడ్జెట్లో సినిమాలు చేస్తుంటాడు రోహిత్. ఈ ఏడాది ఇప్పటికే ఐదు సినిమాలతో పలకరించిన రోహిత్.. ఆరో సినిమా ‘అప్పట్లో ఒకడుండేవాడు’తో ఈ వీకెండ్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ దగ్గర్నుంచి జనాల్లో బాగా ఆసక్తి రేకెత్తిస్తోంది. చివరగా వచ్చిన ట్రైలర్ సినిమాపై అంచనాల్ని మరింత పెంచింది.
నారా రోహిత్ కూడా ఈ సినిమా తనకు చాలా ప్రత్యేకం అంటున్నాడు. తన కెరీర్లో స్పెషల్ ఫిల్మ్ అనదగ్గ ‘ప్రతినిధి’కి.. దీనికి కంటెంట్.. వైవిధ్యం కోణంలో పోలికలు ఉన్నాయంటున్నాడు రోహిత్. ‘‘నేను ఎక్కడికి వెళ్లినా ‘ప్రతినిధి’ లాంటి డిఫరెంట్ సినిమాలు చేయమని అడుగుతుంటారు. ‘అప్పట్లో ఒకడుండేవాడు’ అలాంటి సినిమానే. ఓ వైవిధ్యమైన సినిమా చేయాలన్న తపనే నన్ను ఈ సినిమా చేసేలా చేసింది. కచ్చితంగా ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూసి పాజిటివ్ గా రెస్పాండ్ అవుతారన్న నమ్మకం వుంది. ఇదిఓ డిఫరెంట్ జానర్ మూవీ.. ఆ విషయం సినిమా చూస్తేనే అర్థం అవుతుంది. జనాలు బాగా కనెక్టయ్యే వాస్తవ పాత్రలతో కూడిన కాల్పనిక కథ లాంటిది ‘అప్పట్లో ఒకడుండేవాడు’’ అని రోహిత్ చెప్పాడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/