చాలా రోజులుగా రెండు విషయాలపై మార్పన్నదే లేకుండా చెప్పిందే చెబుతున్నాడు నారా హీరో రోహిత్. ఒకటి పెళ్లి గురించి, మరొకటి సన్నబడటం గురించి. రోహిత్ ఇటీవల మరీ బొద్దుగా మారిపోయాడు. తుంటరి - సావిత్రి సినిమా ప్రచార చిత్రాలు చూస్తుంటే ఆ ఎఫెక్ట్ టూ మచ్‌గా కనిపిస్తోంది. నిజానికి రౌడీ ఫెలోలోనే చాలా లావుగా కనిపించాడు రోహిత్. అందులో పోలీసు పాత్రలో అంత లావుపాటి మనిషిని చూడ్డానికి నానా ఇబ్బందులు పడ్డారు జనాలు. ఆ తర్వాత వచ్చిన అసురలోనూ అదే పరిస్థితి. ఇప్పుడైతే ఇంకొంచెం బొద్దుగా తయారయ్యాడు. ఇంకాస్త పెరిగితే మాత్రం చూడలేం బాబోయ్ అన్న స్థితిలో కనిపిస్తున్నాడు.
అందుకే తరచుగా మీడియా సన్నబడే ఆలోచనలు ఏమైనా ఉన్నాయా అని ఆయన్ని అడుగుతుంటుంది. ఆ ప్రశ్నకు సమాధానం చెబుతూ తప్పకుండా, త్వరలోనే సన్నబడతా, సిక్స్ ప్యాక్ కూడా చేస్తా అని చెబుతూ వస్తున్నాడు. కానీ ఆచరణలో మాత్రం పెట్టట్లేదు. వరుసగా సినిమాలు ఉండటంతో ఖాళీ లేకనో లేదంటే ఇతర కారణం ఏదైనా ఉందో తెలియదు కానీ... నారా బాబు మాత్రం సన్నబడ్డమే లేదు. తుంటరి ప్రమోషన్స్ కోసం బయటికొచ్చిన ఆయన మళ్లీ పాత క్యాసెట్టే వేశాడు. తర్వాత సినిమాకి గ్యారెంటీగా సన్నబడతా అనిచెప్పాడు. మరి ఈ సారైనా చెప్పింది చేస్తాడో లేదో చూడాలి. `నిజానికి నేను తుంటరికే సిక్స్ ప్యాక్ చూపిద్దామనుకొన్నా కానీ కుదర్లేదు` అని చెప్పుకొచ్చాడు రోహిత్. ఇక రెండో విషయానికొస్తే... నారా రోహిత్ కి ఎప్పుడో పెళ్లీడొచ్చింది. మరి పెళ్లెప్పుడు అంటే దాని గురించి ఆలోచించనే లేదంటున్నాడు. ఈసారి కూడా అదే చెప్పాడు. ఈసారి ఆ విషయం గురించి మరో మాట ఎక్కువే చెప్పాడు. ``ఇప్పుడు చేయాల్సిన సినిమాలు చాలా ఉన్నాయి. ఈ సమయంలో పెళ్లి చేసుకొని నేను సెట్ లోనే కూర్చుంటే నా పెళ్లాం విడాకులిచ్చి వెళ్లిపోతుంది`` అంటూ జోకులు పేల్చేశాడు. రోహిత్ నటించిన తుంటరి సినిమా రేపే విడుదలవుతోంది.