సినిమా లైఫ్ 2 వారాలే -నారా రోహిత్

Update: 2016-03-09 05:56 GMT
నారా రోహిత్ నటించిన తుంటరి విడుదలకు సిద్ధమైంది. వరుసగా సినిమాలు చేసేస్తున్న నారా రోహిత్ నటించిన మొదటి రీమేక్ ఈ తుంటరి. కోలీవుడ్ లో హిట్ సాధించిన మాన్ కరాటేను తుంటరిగా తెరపైకి తెస్తున్నాడు కుమార్ నాగేంద్ర. ఈ మూవీలో హీరో కేరక్టర్ చేయడంతోనే ఈ రీమేక్ ని చేస్తున్నట్లు చెప్పాడు నారా రోహిత్. తెలుగు ఆడియన్స్ టేస్ట్ కు తగినట్లుగా స్టోరీ - స్క్రీన్ ప్లే లో కొన్ని మార్పులు చేశామని కూడా అన్నాడు.

తుంటరిలో బాక్సర్ గా కనిపించేందుకు ఎక్కువగా ట్రైనింగ్ తీసుకోలేదంటున్నాడు నారా రోహిత్. బాక్సింగ్ కంటే ఎక్కువగా ఎంటర్ టెయిన్ మెంట్ ఎలిమెంట్స్ ఉంటాయన్నది ఈ హీరో వాదన. అయితే.. ఇప్పుడు వరుసగా సినిమాలు చేసేస్తుండడంపై తన అభిప్రాయం చెప్పుకొచ్చాడు నారా రోహిత్. మొదట ఆరేళ్లు చాలా నెమ్మదిగా సినిమాలు చేశానని, ఇప్పుడు మంచి కథలు వరుసగా రావడంతోనే ఇలా నటించాల్సి వచ్చిందని చెప్పాడు. తానింకా కుర్రాడిని కాబట్టి.. ఇలా ఎక్కువ సినిమాలు చేయడంలో పెద్దగా ఇబ్బంది పడ్డం లేదని కూడా అన్నాడు రోహిత్.

నారా రోహిత్ స్పీడ్ కారణంగా.. ఒక నెల రోజుల టైంలోనే 3 సినిమాలు విడుదల చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. మరి ఇది రిస్క్ కదా అంటే.. ప్రస్తుతం ఏ సినిమా లైఫ్ అయినా 2-3 వారాలకు మించి ఉండడం లేదు కాబట్టి.. ఇదేం పెద్ద రిస్క్ కాదని తేల్చేశాడు నారా రోహిత్. అంతే కాదు.. ఈ సినిమాలన్నీ డిఫరెంట్ జోనర్ వి కావడంతో.. జనాలు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్  కూడా ఉండదని అన్నాడు నారా రోహిత్.
Tags:    

Similar News