నారా రోహిత్ అనగానే సీరియస్ గా, మూడీగా ఉండే పాత్రలే గుర్తుకొస్తాయి. తొలి సినిమా ‘బాణం’ దగ్గర్నుంచి.. గత ఏడాది వచ్చిన ‘అసుర’ వరకు సీరియస్ పాత్రలే చేశాడతను. ‘సోలో’ సినిమాలో కొంచెం అల్లరి చేసినా.. అది పెద్దగా హైలైట్ కాలేదు. ఇక గత రెండేళ్లలో చేసిన ప్రతినిధి - రౌడీఫెలో - అసుర.. మూడు సినిమాలూ చాలా సీరియస్ గా సాగేవే. ఈ సినిమాల్లో రోహిత్ నటన విమర్శకుల ప్రశంసలు అందుకుంది. మిగతా యువ కథానాయకులంతా మాస్ ఇమేజ్ కోసం తపిస్తుంటే రోహిత్ ఎంచుకుంటున్న పాత్రలు - కథలు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచాయి. ఐతే రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు చేసి బోర్ కొట్టేసిన వాళ్లు కొత్తగా ఏదైనా ట్రై చేసినట్లుగా వైవిధ్యమైన సినిమాల మధ్య ఒక కమర్షియల్ సినిమా చేయాలని ఆశపడ్డాడు రోహిత్. తాను ఈ తరహా సినిమాలు కూడా చేయగలనని నిరూపించుకోవాలన్న కోరిక ఉందేమో అతడికి. ఈ క్రమంలోనే ‘తుంటరి’ సినిమా చేశాడు.
ఈ సినిమా ట్రైలర్ చూసినపుడే రోహిత్ చాలా కొత్తగా కనిపించాడు. ఐతే సినిమాలో రోహిత్ ఏమేరకు నెట్టుకొస్తాడా అన్న సందేహాలు నెలకొన్నాయి జనాల్లో ఆ సందేహాల్ని పటాపంచలు చేస్తూ తుంటరి పాత్రలో అదరగొట్టేశాడు రోహిత్. ‘తుంటరి’ సినిమాలో చివరి అరగంట మినహాయిస్తే చాలా అల్లరల్లరిగా ఉంటుంది రోహిత్ క్యారెక్టర్. ఈ పాత్రలో చక్కగా ఒదిగిపోయాడు నారా వారబ్బాయి. సినిమాలో హైలైట్ల గురించి చెబితే.. ఎవ్వరైనా ముందు రోహిత్ పెర్ఫామెన్స్ గురించే చెప్పేలా రాజు పాత్రను రక్తికట్టించాడు రోహిత్. ముఖ్యంగా రోహిత్ కామెడీ టైమింగ్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాలి. ఐతే సినిమాలో మెజారిటీ పార్ట్ ఇలా అల్లరల్లరిగా కనిసిస్తూనే.. చివరికి వచ్చేసరికి పాత్రకు తగ్గట్లుగా రోహిత్ ట్రాన్స్ ఫర్మ్ అయిన తీరు ప్రశంసనీయం. రోహిత్ నటనలో పరిణతి ఇక్కడే కనిపిస్తుంది. ఇక సీరియస్ గా నటించమంటే రోహిత్ కు కొట్టిన పిండే కాబట్టి.. ఆ రకంగానూ ఆకట్టుకున్నాడు. మొత్తంగా ‘తుంటరి’గా రోహిత్ పెర్ఫామెన్స్ సూపర్బ్ అనే చెప్పాలి.