యంగ్ హీరో నారా రోహిత్ ఈ శుక్రవారం ''అప్పట్లో ఒకడుండేవాడు'' అనే సినిమాతో ధియేటర్లలోకి రానున్నాడు. ఇదే సినిమాలో మరో టాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు కూడా మెయిన్ లీడ్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే అంతకంటే ముందే వీరిద్దరూ కాల్ సెంటర్లో చేరిపోయారు తెలుసా? ఇంతకీ సినిమాల్లో హీరోలుగా బాగానే పేరు అండ్ డబ్బు సంపాదిస్తున్న వీరు.. ఇప్పుడు కాల్ సెంటర్లో ఎందుకు చేరారబ్బా?
బాలీవుడ్ తరహాలో టాలీవుడ్లో కూడా ఇప్పుడు రకరకాల యుట్యూబ్ ఛానళ్ళు వచ్చేశాయి. వాటన్నింటిలోనూ రకరకాల తరహాలో తెలుగు సినిమాలను ప్రమోట్ చేస్తున్నారు. అలాంటి ఒక ఛానల్ కోసం ఇప్పుడు రోహిత్ కూడా ఒక ప్రమోషనల్ చేశాడు. దానిలో భాగంగా శ్రీవిష్ణుతో కలసి.. ఇద్దరూ ఒక కాల్ సెంటర్లో చేరతారు. కోర్టు వీరిని అక్కడ పనిచేయమని ఆర్డర్ చేయడంతో అలా చేరారట. మరి వారు చేసిన ఫన్ ఏంటో తెలియాలంటే మీరు వీడియో చూసి తెలుసుకోవాల్సిందే. ఓ విధంగా ఈ ప్రమోషన్ చాలా కొత్తగా బాగుందనే చెప్పాలి.
ఇకపోతే అప్పట్లో ఒకడుండేవాడు స్పెషల్ ప్రీమియర్ గత రాత్రి కొందరు ఫిలిం సెలబ్రిటీలకు వేశారు. మైండ్ బ్లోయింగ్ గా దర్శకుడు సాగర్ ఈ సినిమాను రూపొందించాడని టాక్ వస్తోంది. అలాగే శ్రీవిష్ణు క్రికెటర్ గా అదరగొట్టేస్తే.. ఇనస్పెక్టర్ ఇంతియాజ్ అలీగా రోహిత్ కూడా చంపేశాడని తెలుస్తోంది. మరి రెండు రోజులు గడిస్తే కాని ఈ సినిమాను ఆడియన్స్ కూడా తిలకించే ఛాన్స్ పొందుతారు. అప్పటివరకు.. వెయిట్ చెయ్యండే!!
Full View
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/