'సింగం' సిరీస్ లో ఓ ఇంట్రెస్టింగ్ గేమ్ ఉంటుంది. పోలీసోడి వెంట రౌడీ గ్యాంగ్ పడి వేదిస్తుంది. తన వాళ్లను దెబ్బ కొడుతున్న ప్రతిసారీ పోలీసోడు విలన్ భరతం పట్టేందుకు పరుగులంకించుకుంటాడు. పిల్లి - ఎలుక ఆటలాగా ఉంటుంది. సరిగ్గా ఇదే ఫార్మాట్ లో టాలీవుడ్ లో ఓ సినిమా తెరకెక్కనుంది. ఇందులో బ్రహ్మానందం తనయుడు గౌతమ్ హీరోగా నటిస్తున్నాడు. అతడు ఇందులో ఓ దొంగ. దొంగను వెంటాడే వాడిగా నారా రోహిత్ నటించనున్నాడు. డీటెయిల్స్ లోకి వెళితే...
సుచిత్ర చంద్రబోస్ దర్శకత్వంలో పల్లకి లో పెళ్లికూతురు సినిమాలో నటించి హిట్ కొట్టిన గౌతమ్ కి దశాబ్ధం కెరీర్ లో ఎన్ని ఎటెంప్ట్ లు చేసినా హిట్టు అన్నదే రాలేదు. చివరికి ఎన్నో హోప్స్ పెట్టుకున్న బసంతి కూడా తీవ్రంగా నిరాశపరిచింది. అందుకే ఆచి తూచి అడుగేస్తున్నాడు. ఇప్పుడు గౌతమ్ మీనన్ శిష్యుడు చెప్పిన కథ నచ్చింది. ఓకే చేశాడు. 'వాడే వీడు' అనేది సినిమా టైటిల్. ఇందులో గౌతమ్ ఓ దొంగ గా నటిస్తున్నాడు. మరి దొంగ ఉన్నప్పుడు వెంటాడే పోలీస్ కూడా కావాలి కదా! ఆ పోలీస్ క్యారెక్టర్ కోసం నారా రోహిత్ ని సంప్రదించారు. రోహిత్ ఓకే చెప్పాడు. కానీ ఇప్పుడు అతడు ఉన్న బిజీ షెడ్యూళ్లను బట్టి వచ్చే ఏడాది కానీ అతడికి తీరిక చిక్కదు.
ఇప్పటికిప్పుడు అరడజను ప్రాజెక్టులకు కమిటై ఉన్నాడు నారావారబ్బాయ్! అందుకే వచ్చే ఏడాదిలోనే ఈ సినిమాని లాంచ్ చేయాలన్నది ప్లాన్. రోహిత్ ఈ మూవీలో అతిధిగా కనిపించడు. సినిమా ఆద్యంతం కనిపిస్తాడు. అతడి క్యారెక్టర్ ని స్పెషల్ గా డిజైన్ చేశాడు దర్శకుడు రమేష్ దేసేన. అదండీ విషయం.